ప్రస్తుతం క్రికెటర్ల పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఏ జట్టు వైపు చూసినా… క్రికెటర్ల పెళ్లి భాజంత్రీలు, వారి భార్యల ఫొటోలే దర్శనమిస్తున్నాయి. ఇన్నాళ్లు తీరికలేని క్రికెట్ తో బిజీ.. బిజీ.. లైఫ్ లీడ్ చేసిన ఆటగాళ్లు సమయం దొరకడంతో బ్యాచిలర్ లైఫ్ కు ఫుల్ స్టాప్ పెట్టి మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెడుతున్నారు. కేఎల్ రాహుల్, అక్సర్ పటేల్, హ్యారిస్ రౌఫ్, షాదాబ్ ఖాన్, షాహీన్ అఫ్రిదీ, కసున్ రజిత, చరిత అసలంక, ప్రతుమ్ నిస్సంక.. ఇలా ఒకరివెంట మరొకరు వరుసగా పెళ్లి పీటలు ఎక్కేశారు. అయితే ఇదే నెటిజన్లకు అంతుచిక్కని ప్రశ్నలను రాజేస్తోంది. ఒక్కసారిగా ఇంత మంది క్రికెటర్లు పెళ్లిళ్లు చేసుకోవడంతో.. ఎందుకింత ఆత్రుత..? అంటూ సదరు క్రికెటర్లపై నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. అయితే, దీని వెనుక భారీ స్కెచ్చే ఉన్నట్లు గుసగుసలు వినపడుతున్నాయి. అదేంటన్నది ఇప్పుడు తెలుసుకుందాం…
దేశవాళీ మ్యాచులు, ద్వైపాక్షిక సిరీసులు, ఐసీసీ టోర్నమెంట్లు, విదేశీ లీగులు.. ఇలా బిజీ.. బిజీ.. షెడ్యూల్స్ ఉండటం వల్ల క్రికెటర్లకు సమయం దొరకడమన్నది చాలా కష్టం. వారాంతట వారుగా రెస్ట్ కావాలనో.. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి బోర్డు నుంచి అనుమతి తీసుకొని వారి పర్సనల్ విషయాలు చక్కబెట్టుకోవాలి. కానీ, చాలా మంది క్రికెటర్లు అందుకు ఇష్టపడరు. కారణం.. కొంత కాలం గ్యాప్ తీసుకుంటే దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని కోల్పోయే చాన్స్ ఉంది. అది ఒక్క మ్యాచ్ కావచ్చు.. ఒక్క సిరీస్ కావచ్చు. అతి తక్కువ మందే ఇలా గ్యాప్ తీసుకుంటారు. అయితే.. ఈ మధ్య కాలంలో పెళ్లి పీటలెక్కిన, పెళ్లి వైపు మొగ్గుచూపుతున్న క్రికెటర్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఒక సిరీస్‌కు.. మరో సిరీస్‌కు మధ్య ఉన్న గ్యాప్ లోనే వివాహబంధంలోకి అడుగుపెట్టేస్తున్నారు. ఇదే అభిమానుల్లో అనుమానాలు రాజేస్తుంది.
Beautiful pictures from the marriage of KL Rahul & Athiya Shetty. pic.twitter.com/1Ki1cbklGU
— Johns. (@CricCrazyJohns) January 23, 2023
Congratulations Axar Patel and Meha Patel on marriage @akshar2026 @mehapatel27 😍✨🌹🌹💖💖🤩🤩😘😘 pic.twitter.com/6Ci6IXS2NO
— anuj Pal (@anujPal50037043) January 27, 2023
అలా అని క్రికెటర్లు పెళ్లి చూసుకోకుండా ఉండిపోవాలా అని కాదు.. కానీ ఒక్కసారిగా క్రికెటర్లు ఇలా వరుస పెట్టి ఎందుకు పెళ్లి పీటలు ఎక్కారన్నదే అసలు డౌట్. అందుకు ఓ బలమైన కారణమే ఉంది. ఈ ఏడాది చివరలో ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచ కప్ 2023 జరగాల్సి ఉంది. దానికి ముందు మూడు నెలలు, తరువాత మూడు నెలలు పెళ్ళి చేసుకోవడానికి మంచి సందర్భం కాదు. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో నిలకడగా రాణించడం కోసం ఎక్కువ ప్రాక్టీస్ అవసరం. వీలైనన్ని ఎక్కువ మ్యాచులు ఆడాల్సి ఉంటుంది. ఈ సమయంలో పెళ్లి అన్నారో.. అభిమానుల ఆగ్రహావేశాలకులోను కావాల్సి ఉంటుంది. పోనీ, టోర్నీ తరువాత అంటారా! విజయావకాశాలు ఎలా ఉంటాయో..? గెలిస్తే పర్లేదు.. పెళ్లి అనొచ్చు.. పిల్లల్ని కనొచ్చు.. అదే ఓటమిని చవిచూశారా..! డిప్రెషన్ ఒకవైపు.. అభిమానుల తిట్లు మరోవైపు. ఇదీ మంచిది కాకపోవచ్చు. అందువల్ల.. ఎప్పుడు ఎలా ఉంటుందోనని ఇప్పుడే.. ఓ ఇంటి వాళ్లు అవుతున్నారు.
The loveliest picture on internet today!
Shaheen Afridi with Ansha Afridi🥺🌸#ShaheenAfridi #ShahidAfridi #anshaafridi #ShaheenShahAfridi @SAfridiOfficial pic.twitter.com/397CVDvi66— Maham Gillani (@dheetafridian__) February 4, 2023
ఇక మరీ వీళ్లకు ఇంత తొందరగా వధువు ఎలా దొరుకుతుంది అంటే.. చాలా మంది క్రికెటర్లకు లవ్ స్టోరీలు ఉన్నాయి. ఇప్పటికే పరిచయాలు ఉండటం, మూడు నాలుగేళ్లు డేటింగ్ లో ఉంటారు కనుక పెళ్లికి పెద్దగా సమయం పట్టట్లేదు. రెండు రోజులు పెళ్లి వల్ల క్రికెట్ కు దూరంగా ఉన్నా.. మూడో రోజూ జట్టుతో చేరిపోతున్నారు. భారత క్రికెటర్లు కేఎల్ రాహుల్, అక్సర్ పటేల్.. పరిస్థితి అచ్చం ఇలానే ఉంది. ఈ ఏడాది ఆరంభంలో శ్రీలంకతో జరిగిన ద్వైపాక్షిక సిరీస్ లో కనపడ్డ ఈ ఇద్దరూ, వివాహబంధంలోకి అడుగుపెట్టటం కోసం న్యూజిలాండ్ సిరీస్‌కు దూరంగా ఉన్నారు. అభిమానులారా! చదివారు కదా.. రాబోయేది వరల్డ్ కప్ కావడం వల్ల.. వీలవుతుందో.. వీలవ్వదో అని ఇప్పుడే పెళ్లి చేసుకుంటున్నారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#BREAKING
3 LANKAN CRICKETERS MARRY TODAY❤️
KASUN RAJITHA, CHARITH ASALANKA & PATHUM NISSAKA ALL PLAYING AGAINST AFGHANISTAN PRESENTLY-@Dailymirror_SL-WikiWiks ’22-11-29#SriLanka #Cricket #marriagehttps://t.co/YqeSXOJiRC pic.twitter.com/jguZHDk5qB— Wiki Wickramarathna (@Wikiayiyaa) November 29, 2022