జట్టు నిండా స్టార్ ఆటగాళ్లు ఉంటే.. ఆ జట్టుకు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ, ఐపీఎల్ ప్రాంచైజీ ఆర్‌సీబీ కథ అందుకు విభిన్నం. జట్టులో ఎంత మంది దిగ్గజ ప్లేయర్లు టీమ్‌లో ఉన్నా, విజయం మాత్రం ఆర్‌సీబీకి ఎప్పుడూ ఆమడ దూరమే. అది పురుషులైనా.. విమెన్ అయినా. 'ఈసాలా కప్ నమ్‌దే' అంటూప్రతి సీజన్‌కి ముందు ఆర్‌సీబీ అభిమానులు హడావుడి చేయడం, ఏవేవో సెంటిమెంట్ లెక్కలేసి ఈసారి మా టీమ్ దే కప్పు అని ఆర్భాటాలు చేయడమే తప్ప ఫలితం మాత్రం మారడం లేదు.
జట్టు నిండా స్టార్ ఆటగాళ్లు ఉంటే.. ఆ జట్టుకు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ, ఐపీఎల్ ప్రాంచైజీ ఆర్‌సీబీ కథ అందుకు విభిన్నం. జట్టులో ఎంత మంది దిగ్గజ ప్లేయర్లు టీమ్‌లో ఉన్నా, విజయం మాత్రం ఆర్‌సీబీకి ఎప్పుడూ ఆమడ దూరమే. అది పురుషులైనా.. విమెన్ అయినా. అందుకు ఈ గణాంకాలే ప్రత్యక్ష ఉదాహరణ.. పురుషుల ఐపీఎల్ టోర్నీ ప్రారంభమై ఇప్పటివరకు 15 సీజన్లు గడిచినా ఒక్కసారి టైటిల్ నెగ్గలేకపోయింది. పోనీ, ఈ ఏడాది ప్రారంభమైనా విమెన్ ప్రీమియర్ లీగ్‌లో అయినా ఆ ఫలితం మారుతుందేమో అనుకున్నప్పటికీ, అదీ నిజమయ్యేలా కనిపించడం లేదు. ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓటమి పాలైన ఆర్‌సీబీ మహిళల జట్టు.. నాకౌట్ చేరడం కూడా కష్టమే అనిపిస్తోంది.
‘ఈసాలా కప్ నమ్‌దే’ ఆర్‌సీబీ స్లోగన్ ఇది. ప్రతి సీజన్‌కి ముందు ఇదే స్లోగన్‌తో ఆర్‌సీబీ ఫ్యాన్స్ తెగ హడావుడి చేస్తారు. ఏవేవో సెంటిమెంట్ లెక్కలేసి ఈసారి మా టీమ్ దే కప్పు అని ఆర్భాటాలు చేస్తారు. తీరా టోర్నీ మొదలయ్యాక బెంగళూరు జట్టు ఓటములు చూశాక, ప్రతి ఏడాది ఇంతేగా.. ఇందులో కొత్తేముంది అనుకుంటారు. పోనీ, జట్టులో రాణించే ఆటగాళ్లు లేరా..? అంటే కాదు.. విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్, ఏబీ డివిల్లియర్స్, షేన్ వాట్సన్, కెఎల్ రాహుల్, మార్కస్ స్టోయినిస్.. ఇలా చెప్పుకుంటూ పోతే జట్టు నిండా టీ20 స్టార్లే. అందరూ రాణించే సత్తా ఉన్నవారే. కాకుంటే.. ఫలితం మారడం లేదు.
RCB Fans 🥲 pic.twitter.com/Q1fVztIqih
— Rajabets India🇮🇳👑 (@smileandraja) March 6, 2023
పోనీ, ఆర్‌సీబీ టైటిల్ నెగ్గకపోవడానికి ‘కెప్టెన్సీ’ కారణమా అనడానికి లేదు. విరాట్ కోహ్లీ పగ్గాలు చేపట్టాక ముందు రాహుల్ ద్రావిడ్, కెవిన్ పీటర్సన్, అనిల్ కుంబ్లే, డానియల్ విటోరి.. జట్టును నడిపించారు. టైటిల్ అందించలేకపోయాయరు. వీరి అనంతరం టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ 9 సీజన్ల పాటు జట్టును నడిపించాడు. అదే ఫలితాలు. ఇక లాభం లేదనుకున్న కోహ్లీ, కెప్టెన్సీ నుంచి తప్పుకుంటే టైటిల్ వస్తుందేమో అన్న ఆశతో గతేడాది ఫాఫ్ డుప్లిసిస్‌కి పగ్గాలు అప్పగించాడు. ఫాఫ్ సారధ్యంలో ఆర్‌సీబీ, ఐపీఎల్ 2022 సీజన్‌లో రెండో క్వాలిఫైయర్ దాకా వెళ్లగలిగింది కానీ టైటిల్ మాత్రం గెలవలేకపోయింది. పోనీ ఇప్పుడైనా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ద్వారా ఆ కోరిక నెరవేరుతుందేమో అనుకున్నా అదీ సాధ్యపడేలా లేదు.
RCB in every season 😂 pic.twitter.com/deOkZ1o9q9
— UNSTOPPABLE (@unstoppable__45) March 6, 2023
టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధానని రూ.3.40 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన ఆర్‌సీబీ యాజమాన్యం జట్టు పగ్గాలు అప్పగించింది. ఆమెకు తోడుగా అంతర్జాతీయ మహిళా టీ20 స్టార్లైనా.. సోఫి డివైన్, ఎలీసా పెర్రీ, ఎరిన్ బర్న్స్, హేథర్ నైట్, డాన్ వాన్ నెరిక్, రిచా ఘోష్, రేణుకా సింగ్ వంటి నాణ్యమైన ప్లేయర్లను అందించింది. అయినప్పటికీ.. ఫలితం మారడం లేదు. మంధాన సారధ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ జట్టు ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 60 పరుగుల తేడాతో ఓడిన ఆర్‌సీబీ, తాజాగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. దీనంతటికి కారణం.. ఆర్‌సీబీ బ్రాండ్ బౌలింగ్. ఢిల్లీతో జరిగిన మ్యాచులో ప్రత్యర్థి జట్టుకి 222 పరుగులు సమర్పించిన ఆర్‌సీబీ బౌలర్లు, ముంబైతో జరిగిన మ్యాచులో 155 పరుగుల లక్ష్యాన్ని 15 ఓవర్లలోపే ముగించేశారు. ఇదీ ఆర్‌సీబీ బ్రాండ్. పురుషులకు ఏమాత్రం తగ్గకుండా అమ్మాయిలు సైతం ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. ఆర్‌సీబీ టైటిల్ నెగ్గకపోవడానికి కారణాలేంటో.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
We believe in you, Captain! Let’s bounce back, the 12th Man Army is behind you! 👊#PlayBold #ನಮ್ಮRCB #SheIsBold #WPL2023 #MIvRCB pic.twitter.com/imZiQ5eJLT
— Royal Challengers Bangalore (@RCBTweets) March 6, 2023