ఐపీఎల్ 2023లో ఎలాగైన కప్ కొట్టాలనే లక్ష్యంతో ఆర్సీబీ ఒక మాస్టర్ ప్లాన్‌తో బరిలోకి దిగుతుంది. దీంతో ఆర్సీబీ అభిమానుల్లో ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.
క్రికెట్ అభిమానులకు నాన్‌స్టాప్ వినోదాన్ని అందించే ఐపీఎల్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నెల 31 నుంచి ఐపీఎల్ 2023 సీజన్ మొదలుకానున్న విషయం తెలిసిందే. ఈ సీజన్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే ఇప్పటికే దాదాపు అన్ని జట్లు ప్రాక్టీస్ క్యాంప్‌లను ప్రారంభించేశాయి కూడా. ఎవరికి వారు ఈసారి కప్ సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టుపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆర్సీబీతో పాటు ఢిల్లీ, పంజాబ్‌లు సైతం ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కప్ కొట్టకపోయినా.. వారిపై కంటే ఆర్సీబీపై కప్ కొట్టాలనే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆర్సీబీకి ఉన్న క్రేజ్ అలాంటిది. ఐపీఎల్‌లో అన్ని టీమ్‌లకంటే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న టీమ్ ఆర్సీబీ అనే విషయం తెలిసిందే.
అయితే.. ఈ సీజన్‌లో ఎలాగైన కప్పు కొట్టాలనే లక్ష్యంతో ఆర్సీబీ బరిలోకి దిగుతోంది. అందుకోసం ఒక్క పక్కా ప్రణాళికను సైతం సిద్ధం చేసుకుంది. ఐపీఎల్ 2023 మినీ వేలానికి కంటే ముందే ఆర్సీబీ ఒక నిర్దిష్ట ప్రణాళిక, మాస్టర్ ప్లాన్‌తో ముందుకు వెళ్తోంది. ఐపీఎల్ 2022లో ఆర్సీబీ ప్రదర్శన పర్వాలేదు. దాదాపు 15 సీజన్లలో కప్పు కొట్టలేక జట్టు విఫలమైనా.. 16వ సీజన్‌లో ఒక మాస్టర్ ప్లాన్‌తో ఆర్సీబీ బరిలోకి దిగుతుంది. 2022లో ఆడిన జట్టులోనే పెద్దగా మార్పులు లేకుండా.. విన్నింగ్ టీమ్‌పై నమ్మకంతో ఆడనుంది. గతేడాది విరాట్ కోహ్లీ ఫామ్‌లో లేడు. కానీ.. ఇప్పుడు మళ్లీ పాత కోహ్లీని గుర్తుకు చేస్తూ ఆడుతున్నాడు. ముఖ్యంగా టీ20 క్రికెట్‌లో ఎలాంటి ఫామ్‌లో ఉన్నాడో టీ20 వరల్డ్ కప్‌లో చూశాం. కోహ్లీ ఫామ్‌లో ఉంటే.. జట్టులో ఎలాంటి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
అలాగే కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, దినేష్ కార్తీక్, రజత్ పటీదార్ ఎలాగో ఆర్బీసీకి బలంగానే ఉన్నారు. ఇక మినీ వేలంలో విల్ జాక్స్‌ను కొనుగోలు చేసినా.. అతను గాయంతో ఐపీఎల్ దూరం కావడంతో అతని స్థానంలో న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ బ్రేస్‌వెల్‌ను తీసుకున్నారు. అతని రాకతో టీమ్ మరింత స్ట్రాంగ్ కానుంది. ఇక బౌలింగ్ విభాగం సిరాజ్ బిగ్ ఎసెట్. గతేడాది సిరాజ్ వైఫల్యం కూడా జట్టుపై ప్రభావం చూపింది. కానీ, ఇప్పుడు సిరాజ్ వరల్డ్ నంబర్ వన్ వన్డే బౌలర్. బాల్‌ను రెండు వైపుల స్వింగ్ చేస్తూ.. బ్యాటర్లను వణికిస్తున్నాడు. అతనికి ఆస్ట్రేలియా టాప్ బౌలర్ జోస్ హెజల్‌వుడ్ తోడుగా ఉన్నాడు. ఇక స్పిన్‌లో శ్రీలంక మిస్టరీ స్పిన్నర్ వనిందు హసరంగా ఉండనే ఉన్నాడు. ఇలా గతేడాది టీమ్‌నే ఈ ఏడాది కూడా కొనసాగిస్తూ.. అడ్డగోలు మార్పులు చేసి, జట్టులో గందరగోళం లేకుండా ఆర్సీబీ టీమ్ మేనేజ్‌మెంట్ జాగ్రత్త పడింది. ఏ విధంగా చూసుకున్న ఈ ఏడాది ఆర్సీబీ జట్టు మంచి బ్యాలెన్డ్స్‌గా ఉంది. విన్నింగ్ టీమ్‌ను కొనసాగించడం ఈ ఏడాది ఆర్సీబీ మాస్టర్ ప్లాన్ మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
RCB TICKET SALES AT CHINNASWAMY STADIUM 🎟️
Important information about dates and timings of ticket sales for the RCB Home matches. Tickets are only sold in gates 18 and 19 from 10:30 AM to 8:30 PM as per the release schedule. 📝#PlayBold #ನಮ್ಮRCB #IPL2023 pic.twitter.com/D134fIPcnE
— Royal Challengers Bangalore (@RCBTweets) March 18, 2023