ఐపీఎల్ 2022 సీజన్ సందడిగా సాగుతోంది. ఇప్పటికే ఐదు మ్యాచ్ లు పూర్తయ్యాయి. కొత్త జట్లు రావడంతో ఉత్సాహం రెట్టింపు అయ్యింది. ఐపీఎల్ తరహాలో పాకిస్థాన్ లీగ్ ఒకటి ఉందని అందరికీ తెలిసిందే. అయితే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాజీలు ఎప్పుడూ ఐపీఎల్ పై అక్కసు వెళ్లగక్కుతూనే ఉంటారు. తమ ప్లేయర్లు తోపులు కాబట్టే ఐపీఎల్ లోకి తీసుకోవడం లేదంటూ గప్పాలకు పోతుంటారు. తాజాగా రావల్ పిండి ఎక్స్ ప్రెస్ షోయబ్ అక్తర్ కూడా అలాంటి వ్యాఖ్యలే చేశాడు.
ఇదీ చదవండి: IPL 2022: RCB vs KKR.. గెలుపెవరిదీ? బలం, బలహీనతలు ఇవే!
పాకిస్థాన్ కెప్టెన్ బాబార్ ఆజమ్ ని ఆకాశానికి ఎత్తేశాడు. అతనుగానీ ఐపీఎల్ వేలంలో ఉంటే ఫ్రాంచైజీలు అతడిని రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్లకు కొనుగోలు చేస్తారంటూ అతి ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించాడు. అంతేకాకుండా తనకు మరో కోరిక కూడా ఉందని చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ లో ఏదొక రోజు బాబర్ ఆజమ్- విరాట్ కోహ్లీ కలిసి ఓపెనింగ్ చేస్తే చూడాలని ఉందని తన కోరికను బయటపెట్టాడు. షోయబ్ అక్తర్ కోరిక తీరుతుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.