టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ జడేజా.. స్పిన్నర్ అవ్వడానికి ముందు ఫాస్ట్ బౌలర్ అవుదాం అనుకున్నాడు. కానీ, అది జరగలేదు. అది ఎందుకు జరగలేదో జడేజా వివరించాడు. మరి ఆ విషయాన్ని మీరూ తెలుసుకోండి..
ప్రస్తుత భారత క్రికెట్ జట్టులో రవీంద్ర జడేజా ఎంతో కీలక ఆటగాడు. తన బ్యాటింగ్‌తో, బౌలింగ్‌తో టీమ్‌కు బిగ్ అసెట్‌గా మారాడు. టీ20 వరల్డ్ కప్ 2022 కంటే ముందు మోకాలి గాయం కారణంగా జట్టుకు దూరమైన జడేజా.. ఆ తర్వాత మోకాలికి శస్త్రచికిత్స చేయించుకుని వరల్డ్ కప్‌కు సైతం దూరం అయ్యాడు. జడేజా లేని లోటు వరల్డ్ కప్ మ్యాచ్‌ల్లో స్పష్టంగా కనిపించింది. అయితే సర్జరీ తర్వాత కాస్త కోలుకున్న జడేజా ఆ తర్వాత న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌లకు సైతం దూరం అయ్యాడు. కానీ, అతని భార్య గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు మాత్రం ముమ్మరంగా ప్రచారంలో పాల్గొన్నాడు. దీంతో జడేజాపై విమర్శలు వచ్చాయి.
కానీ, ఆస్ట్రేలియాతో జరిగిన ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ముందు ఒక దేశవాళీ మ్యాచ్ ఆడి టీమిండియాలోకి వచ్చిన జడేజా అదరగొడుతున్నాడు. సర్జరీ తర్వాత ఒక కొంత జడేజా కనిపిస్తున్నాడు. ఆస్ట్రేలియాతో టెస్టులో దుమ్ములేపిన జడేజా, అశ్విన్‌తో కలిసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును అందుకున్నాడు. అలాగే ముంబైలో ఆసీస్‌తో జరిగిన తొలి వన్డేలోనూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు జడేజాకే దక్కింది. ఇలా వరుస అద్భుత ప్రదర్శనలతో రాణిస్తున్న జడేజా.. తాజాగా ఒక షాకింగ్ విషయాన్ని వెల్లడించాడు. క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్న కొత్తలో జడేజా.. ఫాస్ట్ బౌలర్ అవుదాం అనుకున్నాడంట కానీ, చివరికి స్పిన్నర్‌గా మారిపోయాడు. మరి అలా ఎందుకు జరిగిందో వివరిస్తూ..
జడేజా మాట్లాడుతూ.. ‘కొన్నేళ్ల క్రితం నేను క్రికెట్ ఆడటం మొదలుపెట్టినప్పుడు మిగతా బౌలర్లు బౌన్సర్లు వేయడం చూశాను. అది నాకు బాగా నచ్చింది. అందుకే నేను కూడా ఫాస్ట్ బౌలర్ అవుదాం అనుకున్న. కానీ నా దగ్గద పేస్ బౌలింగ్‌కు సరిపోయేంత వేగం లేకపోవడంతో వెనక్కి తగ్గాను.’ అని జడేజా తాను పేస్ బౌలర్ కాలేకపోవడానికి కారణం వివరించాడు. ఇక తన క్రికెట్ జీవితాన్ని ఇద్దరు మహేంద్రులు ప్రభావితం చేశారని.. ఆ విషయాన్ని మహేంద్ర సింగ్ ధోనికి సైతం చెప్పినట్లు జడేజా వెల్లడించాడు. ‘ఆ ఇద్దరు మహేద్రులలో జామ్‌నగర్‌లో నా కోచ్ మహేంద్ర సింగ్ ఒకరైతే, ఇంకొకరు మహేంద్రసింగ్ ధోని’ అని జడేజా తెలిపాడు. మరి జడేజా వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
“My cricketing journey is between my coach MS Chauhan and Mahendra Singh Dhoni.”
– RAVINDRA JADEJA 💛@MSDhoni #MSDhoni #WhistlePodu pic.twitter.com/HorKd7kopE
— DHONIsm™ ❤️ (@DHONIism) March 17, 2023