ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియా వైఫల్యానికి బౌలింగ్ కారణమనే విమర్శలు వచ్చాయి. ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో పాటు మరో స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సైతం మోకాలి సర్జరీ కారణంగా వరల్డ్ కప్ దూరమయ్యాడు. వీరిద్దరూ లేని లోటు జట్టులో స్పష్టంగా కనిపించింది. బుమ్రా, జడేజా జట్టులో ఉండిఉంటే.. కచ్చితంగా ఫలితం వేరేలా ఉండేది. కానీ.. బుమ్రా ఆసియా కప్‌లో గాయపడటం.. వరల్డ్ కప్‌కు ఎంపిక అయిన తర్వాత జడేజా మోకాలికి శస్త్రచికిత్స చేయించుకుని వరల్డ్ కప్ దూరమయ్యారు. ఇక వరల్డ్ కప్ తర్వాత.. టీమిండియా న్యూజిలాండ్‌తో సిరీస్ ఆడింది. సీనియర్లకు రెస్ట్ ఇవ్వడంతో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోని యంగ్ టీమిండియా 1-0తో టీ20 సిరీస్ గెలిచింది.
ఆ తర్వాత రేపటి(శుక్రవారం) నుంచి శిఖర్ ధావన్ కెప్టెన్సీలో న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ వెంటనే.. బంగ్లాదేశ్‌తో రెండు టెస్టులు, మూడు వన్డేల సిరీస్ ఆడనుంది టీమిండియా. టెస్టు సిరీస్ కోసం ఎప్పుడో జట్టును ప్రకటించిన సెలెక్టర్లు. వన్డే సిరీస్ కోసం బుధవారం రాత్రి సెలెక్టర్లు లేకుండానే బీసీసీఐ జట్టును ప్రకటించింది. వరల్డ్ కప్‌లో వైఫల్యం కారణంగా చేతన్‌శర్మ నేతృత్వంలోని సెలెక‌్షన్ కమిటీని తొలగించిన విషయం తెలిసిందే. కొత్త కమిటీ ఏర్పాటు కాకుండానే బీసీసీఐనే స్వయంగా వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించింది. అయితే.. ఈ జట్టులో భీకర ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్ యాదవ్‌తో పాటు సంజు శాంసన్‌కు కూడా చోటు దక్కలేదు. అలాగే జడేజాను పక్కన పెట్టారు.
మోకాలి గాయానికి సర్జరీ చేయించుకున్న జడేజా.. ఇంకా పూర్తిగా కోలుకులేదని, అందుకే బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌కు పక్కన పెట్టినట్లు బీసీసీఐ పెద్దలు చెబుతున్నారు. కానీ.. క్రికెట్ అభిమానుల నుంచి మాత్రం వేరే వాదన వినిపిస్తోంది. జడేజా కావాలనే బంగ్లాదేశ్‌తో టెస్టు, వన్డే సిరీస్‌లకు దూరం అవుతున్నాడని.. అందుకు గుజరాత్ ఎన్నికలే కారణమంటూ మండిపడుతున్నారు. వరల్డ్ కప్ ఉందని తెలిసినా.. బీసీసీఐకి చెప్పకుండా మోకాలి సర్జరీ చేయించుకున్న జడేజా వరల్డ్ కప్ దూరంగా ఉన్నాడు. ఇప్పుడు బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపికైనా.. ఇంకా కోలుకోలేని తప్పుకునే ప్రయత్నంలో ఉన్నాడు. అలాగే వన్డే సిరీస్‌కు సైతం అందుబాటులో లేడు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో జడేజా భార్య రివాబా జడేజా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ ఎన్నికల కోసమే జడేజా టీమిండియా తరఫున బంగ్లాదేశ్‌తో సిరీస్ ఆడేందుకు వెళ్లడం లేదని క్రికెట్ అభిమానులు ఆరోపిస్తున్నారు. నిజంగానే సర్జరీ నుంచి కోలుకోకుంటే.. జాతీయ జట్టు తరఫున ఆడాలనే డెడికేషన్ ఉంటే.. బెంగుళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్లి ఫిట్‌నెస్ సాధించకుండా.. గుజరాత్‌లో ఎన్నికల ప్రచారం ఎందుకు చేస్తున్నాడని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. కేవలం తన భార్యను ఎమ్మెల్యేను చేయడం కోసం టీమిండియా ఆడే మ్యాచ్‌లను సైతం కాదని.. ప్రచార కార్యక్రమాలను దగ్గరుండి చూసుకుంటున్నాడంటూ ఆరోపిస్తున్నారు. ఇప్పటికే జడేజా తన భార్య తరఫున ప్రచారం ర్యాలీలో పాల్గొన్నాడు. మరి ఈ విషయంలో జడేజా ఎలాంటి వివరణ ఇస్తాడో చూడాలి. ఇప్పటికే వరల్డ్ కప్ వైఫల్యంతో విమర్శలు ఎదుర్కొన్న టీమిండియా.. స్టార్ ప్లేయర్ గైర్హాజరీతో బంగ్లాదేశ్‌తో సిరీస్ కాస్త అటూఇటు అయినా.. పరువుపోవడం ఖాయం.
જન-જનનાં મનમાં બસ એક જ વાત
વારંવાર રચાશે ભાજપ સરકાર….#ભરોસાની_ભાજપ_સરકાર pic.twitter.com/LRkGwuDD3E— Rivaba Ravindrasinh Jadeja (@Rivaba4BJP) November 24, 2022
Pleasure meeting you sir @AmitShah #jamnagar pic.twitter.com/xqfcHCMtFk
— Ravindrasinh jadeja (@imjadeja) November 21, 2022
The report also adds that Shahbaz Ahmed might replace Jadeja in the ODI squad 🏏#crickettwitter #jadeja pic.twitter.com/LHQ8AJLSCv
— Sportskeeda (@Sportskeeda) November 23, 2022
cricket king🏏@imjadeja pic.twitter.com/3cQSOSMnLX
— Dhara Bhatt (@Dimpzy_doll_777) November 21, 2022
ભારતના ઓલ રાઉન્ડર ક્રિકેટર શ્રી @imjadeja નો રોડ શૉ તમે પણ જોડાશૉ.. pic.twitter.com/b2yyD5RUoK
— Rivaba Ravindrasinh Jadeja (@Rivaba4BJP) November 22, 2022
The saffron “ warrior’s ”
#RivabaJadeja #RavindraJadeja @imjadeja #GujaratElections2022 pic.twitter.com/b5v7jveeIk
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) November 16, 2022