ఐపీఎల్ సెకెండ్ హాఫ్ సందడి మొదలై పోయింది. యూఏఈలో ఇప్పటికే క్వారంటైన్ పూర్తి చేసుకుని ఆటగాళ్లు నెట్స్‌లో ప్రాక్టీస్ మొదలు పెట్టారు. వ్యక్తిగత కారణాలు, టీ20 వరల్డ్‌కప్ దృష్ట్యా కారణం ఏదైనా పలువురు విదేశీ ఆటగాళ్లు ఈ సీజన్‌లో ఐపీఎల్‌కు దూరమవుతున్నారు. వెళ్లిపోయిన ప్లేయర్ల స్థానంలో రీప్లేస్‌మెంట్స్‌ను కూడా ఎంచుకున్నారు. ఆ క్రమంలో సీఎస్‌కే కూడా ఆ షాక్ తగిలింది. ఇప్పుడు తాజాగా మరో ప్రశ్న సీఎస్‌కే అభిమానుల్లో మొదలైంది. ఎంఎస్ ధోనీ తర్వాత సీఎస్‌కేకి ఎవరు సారధిగా ఉంటారు. ఇదే ప్రశ్నను సీఎస్‌కే ఆర్మీ అనే పేజ్‌లో అభిమానులు వ్యక్త పరిచారు. ఆ ప్రశ్నకు అనూహ్యంగా సీఎస్‌కే ఆల్‌రౌండ్ రవీంద్ర జడేజా సమాధానమిచ్చాడు.
ఐపీఎల్, టీ20ల్లో రవీంద్ర జడేజాకు ఆల్‌రౌండర్‌గా మంచి పేరుంది. ముఖ్యంగా ఐపీఎల్‌లో మంచి రికార్డులే ఉన్నాయి. ఐపీఎల్‌లో 191 మ్యాచ్‌లు ఆడిన జడేజా 128.07 స్ట్రైక్ రేట్‌తో 2290 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో రెండు హాఫ్ సెంచరీలు కూడా చేశాడు. 191 మ్యాచుల్లో 30.25 బౌలింగ్ యావరేజ్‌తో జడేజా 120 వికెట్లు పడగొట్టాడు. వాటిలో ఒక ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు, మూడుసార్లు 4 వికెట్లు తీసిన రికార్డు కూడా ఉంది. జడేజాపై ధోనీకి చాలా నమ్మకం. ఎప్పుడైనా సుధీర్ఘ భాగస్వామ్యాన్ని బ్రేక్ చేయాలంటే జడేజాకే బంతి ఇస్తాడు. మరి అంతటి నమ్మకమున్న జడేజా కెప్టెన్‌గా ఎవరి పేరును ప్రస్తావించాడు అనుకున్నారు.
జడేజా రిప్లై ఇచ్చి వెంటనే డిలీట్ చేశాడు. కానీ, అప్పటికే అభిమానులు స్క్రీన్ షాట్ తీశారు. అందులో జడేజా జెర్సీ నంబరు 8ని కామెంట్ చేశాడు. అంటే చెప్పకనే జడేజాకి కెప్టెన్సీపై ఆసక్తి ఉన్నట్లు తెలియజేశాడు. మరి, ధోనీ తర్వాత జట్టు బాధ్యతలు ఎవరికి ఇస్తారో తెలీదు కానీ, అందుకు సంబంధించిన రేసులో ఉండగల సమర్థత జడేజాకి ఉందని అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ 19న యూఏఈ వేదికగా ఐపీఎల్ సెకెండ్ హాఫ్‌లో సీఎస్‌కే, ముంబయి ఇండియన్స్‌తో తలపడనుంది.
మరి, జడేజా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బాధ్యతలు తీసుకుంటే ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి.
😂⚔️🔥#WhistlePodu | @imjadeja 🦁 pic.twitter.com/Mnx93U9qCa
— CSK Fans Army™ 🦁 (@CSKFansArmy) September 14, 2021