భారత్-వెస్టిండీస్ మధ్య మూడు వన్డేల సిరీస్ నేటి(శుక్రవారం) నుంచి ప్రారంభం కానుంది. పోర్ట్ ఆఫ స్పెయిన్ వేదికగా తొలి వన్డే జరగనుంది. కాగా టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, బుమ్రా లాంటి స్టార్ ఆటగాళ్లు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో సీనియర్ ఆటగాడు శిఖర్ ధావన్ కెప్టెన్సీలో టీమిండియా ఆడనుంది.
ఇలా స్టార్లు లేని టీమిండియాకు తొలి వన్డే ముందే భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ సిరీస్‌కు స్టాండింగ్ వైస్ కెప్టెన్‌గా ఉన్న రవీంద్ర జడేజా మోకాలి గాయంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో నేటి మ్యాచ్‌కు ఈ ఆల్‌రౌండర్ దూరం కానున్నట్లు సమాచారం. కాగా ఇంగ్లండ్‌తో ఆఖరి వన్డేలోనే మోకాలి గాయంతో ఇబ్బంది పడ్డాడు జడేజా. ఇక విండీస్‌తో సిరీస్‌కు ముందు ఈ గాయం మరింత తీవ్రమైందని తెలుస్తోంది. దీంతో అతను మొదటి మ్యాచ్‌కు దూరం కానున్నాడని సమాచారం.
అయితే జడేజాను తొలి మ్యాచ్‌కే దూరం పెట్టాలా లేక మొత్తం వన్డే సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించాలా అన్నది బీసీసీఐ యోచిస్తుంది. మూడు వన్డేల సిరీస్ ముగిసిన వెంటనే వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. మరి అప్పటి వరకు జడేజా కోలుకుంటాడా లేదా అన్నది అనుమానమే. ఇప్పటికే టీమిండియా పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. జడేజా కూడా జట్టుకు దూరమైతే టీమిండియా కష్టాలు తప్పేలా లేవు.
Ahead of the first ODI against West Indies, India captain Shikhar Dhawan said that Ravindra Jadeja may miss the match with a niggle#WIvINDhttps://t.co/D4cSpfC5v6
— CricketNDTV (@CricketNDTV) July 22, 2022