టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఆనందంలో మునిగితేలుతున్నాడు. అందుకు కారణం.. అతని భార్య రివాబా జడేజా. ఇటీవల జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఆమె.. ఎమ్మెల్యేగా విజయం సాధించింది. ఈ క్రమంలో జడేజా గాల్లోకి డబ్బులు విసురుతూ సంబరాలు చేసుకుంటున్నాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే.. కొందరు జడేజా తీరును విమర్శిస్తున్నారు. చేతికి డబ్బులివ్వకుండా అలా విసిరేయడం ఏంటని మండిపడుతున్నారు.
జడేజా బంగ్లాదేశ్ టూర్ కు డుమ్మా కొట్టిన సంగతి తెలిసిందే. గాయాన్ని సాకుగా చూపిన జడ్డూ.. భార్య ఎన్నికల క్యాంపెయిన్ లో చురుగ్గా పాల్గొన్నాడు. గుజరాత్ లోని జామ్‌నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రివాబా.. తన సమీప ప్రత్యర్థి, ఆప్ అభ్యర్థి కర్షన్ భాయ్‌పై సుమారు 53 వేల ఓట్లకు పైగా మెజారిటీతో గెలుపొందింది. ఈ నేపథ్యంలో జడేజా తన భార్యకు కంగ్రాట్స్ తెలిపాడు. ‘హలో మై ఎమ్మెల్యే..’ అంటూ తన ట్విట్టర్ ఖాతాలో విషెస్ తెలిపాడు. ఈ విజయానికి అర్హురాలువని, జామ్‌నగర్ ప్రజలు గెలిచారని, ప్రజలకు హృదయపూర్వక వందనలు తెలియచేస్తున్నానని చెప్పుకొచ్చాడు. ఎమ్మెల్యే గుజరాత్ అన్న చిన్న ప్లకార్డును రివాబా పట్టుకున్న ఫోటోను ట్వీట్ చేశారు. ఈ క్రమంలోనే జడేజా డబ్బులు వెదచల్లి ఉండవచ్చు. ఏదేమైనా.. చేతికి ఇవ్వకుండా.. వెదచల్లడం విమర్శలకు తావిస్తోంది.
Hello MLA you truly deserve it. જામનગર ની જનતા નો વિજય થયો છે. તમામ જનતા નો ખુબ ખુબ દીલથી આભાર માનુ છુ. જામનગર ના કામો ખુબ સારા થાય એવી માં આશાપુરા ને વિનંતી. જય માતાજી🙏🏻 #મારુજામનગર pic.twitter.com/2Omuup5CEW
— Ravindrasinh jadeja (@imjadeja) December 9, 2022
— Out Of Context Cricket (@GemsOfCricket) December 9, 2022