ఏంటి సినిమాల్లోకి క్రికెటర్ రవీంద్ర జడేజానా? ఏ మూవీలో యాక్ట్ చేస్తున్నాడు అనేగా మీ డౌట్. మీ సందేహాలకు సమాధానం కావాలంటే ఈ ఆర్టికల్ ని చివరి వరకు చదివేయండి.
టైటిల్ చూడగానే మీరు షాకై ఉంటారు కదా. కానీ మీరు విన్నది నిజమే. టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా.. కెరీర్ పరంగా పీక్ స్టేజీలో ఉండగానే సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అందుకు సంబంధించిన ప్రకటన కూడా వచ్చేసింది. అయితే ఇది చూసి చాలామంది ఫ్యాన్స్ ఫస్ట్ షాకయ్యారు. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుని రిలాక్స్ అయిపోయారు. జడేజాతో పాటు అతడి భార్య ఎంట్రీ కూడా దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది. మరి ఆ విశేషాలేంటి? ఇంతకీ జడేజా సినిమాల ఎంట్రీ సంగతేంటో ఓసారి చూసేద్దాం.
ఇక వివరాల్లోకి వెళ్తే.. టీనేజీలో చాలా పేరు తెచ్చుకున్న జడేజా, 2005 అండర్-19 ప్రపంచకప్ లోనూ టీమిండియాకు ఆడాడు. ఆ ఏడాది మన జట్టు కప్ గెలవకపోయినప్పటికీ ఫైనల్లో జడేజా, తన బౌలింగ్ తో అందరినీ ఇంప్రెస్ చేశాడు. అలా కొన్నాళ్లకు అంటే 2009 ఫిబ్రవరిలో శ్రీలంకతో జరిగిన సిరీస్ తో జాతీయ జట్టులోకి వచ్చేశాడు. తొలి సీజన్ లోనే ఐపీఎల్ లోనూ అడుగుపెట్టేశాడు. అప్పటినుంచి ధోనీ కెప్టెన్సీలో ఎంతో పేరు తెచ్చుకున్న జడేజా మధ్యలో కొన్నాళ్లు ఫామ్ కోల్పోయాడు. కానీ మళ్లీ ఫిట్ నెస్ సంపాదించి ముందు కంటే పవర్ ఫుల్ గా తయారయ్యాడు.
ప్రస్తుతం టీమిండియా తరఫున అన్ని ఫార్మాట్లకు ఆడుతున్న ఇతడు.. ఆ మధ్య తన భార్య కోసం రాజకీయ ప్రచారం కూడా చేశాడు. ఇప్పుడు ఆమెతో కలిసి సినీ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాడు. తాజాగా ఆ సినిమా పూజా కార్యక్రమం జరిగింది. జడేజా భార్య రివాబా ఈ ఈవెంట్ లో పాల్గొంది. ఇదిలా ఉండగా ‘పచ్చత్తర్ ఖా చోరా’ టైటిల్ తో తీస్తున్న ఈ సినిమాలో రణ్ దీప్ హుడా, నీనా గుప్తా లాంటి స్టార్స్ యాక్ట్ చేస్తున్నారు. జయంత్ గిల్తార్ దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ కూడా ప్రారంభమైపోయింది. త్వరలో ఇతర వివరాలు వెల్లడించే అవకాశముంది. మరి జడేజా మూవీ ఎంట్రీపై మీరేం అంటారు. కింద కామెంట్ చేయండి.