గంటల కొద్ది క్రీజ్‌లో పాతుకుపోయి, వందకు పైగా బంతులను ఎదుర్కొన్న తర్వాత కూడా ఆస్ట్రేలియా కెప్టెన్ స్మిత్.. జడేజా బౌలింగ్‌లో స్కూల్ పిల్లాడు అవుటైనట్లు అవుట్ అయ్యాడు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య అహ్మాదాబాద్ వేదికగా చివరిదైన నాలుగో టెస్టు గురువారం ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసేందుకు నిర్ణయించింది. స్వదేశం నుంచి ప్యాట్ కమ్మిన్స్ రాకపోవడంతో స్టీవ్ స్మిత్ ఈ మ్యాచ్‌కు సైతం ఆస్ట్రేలియా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. టీమిండియా ఒక్క మార్పుతో ఈ టెస్టులో బరిలోకి దిగింది. పేసర్ మొహమ్మద్ సిరాజ్ స్థానంలో షమీని తుది జట్టులోకి తీసుకున్నారు. నాలుగో టెస్టులో వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌కు చోటు ఇస్తారని భావించినా.. కోచ్, కెప్టెన్ మాత్రం కేఎస్ భరత్‌పైనే నమ్మకం ఉంచారు. అయితే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా పటిష్టంగానే ఆడుతోంది.
ఓపెనర్లు ట్రావిస్ హెడ్-ఉస్మాన్ ఖవాజా మంచి ఆరంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 61 పరుగులు జోడించిన తర్వాత.. హెడ్ 31 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. ఆ వెంటనే లబుషేన్‌ను షమీ అవుట్ చేయడంతో ఆసీస్ 72 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఇక్కడి నుంచి ఖవాజాతో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ జత కలిశాడు. ఇద్దరూ కలిసి ఆసీస్ ఇన్నింగ్స్‌ను అద్భుతంగా ముందుకు నడిపించారు. ఆచితూచి ఆడుతూ.. విలు చిక్కినప్పుడల్లా షాట్లు ఆడారు. ముఖ్యంగా స్మిత్ చాలా నిదానంగా బ్యాటింగ్ చేశాడు. 135 బంతులు ఆడి కేవలం 3 ఫోర్లు బాది 38 రన్స్ చేశాడు.
అంతసేపు క్రీజ్‌లో పాతుకుపోయిన స్మిత్‌ను జడేజా ఇన్నింగ్స్ 64వ ఓవర్‌లో 4వ బంతికి అవుట్ చేశాడు. జడేజా ఏదో అద్భుతమైన బంతి వేసి స్మిత్‌ను అవుట్ చేయలేదు. స్మిత్ ఒక చెత్త షాట్ ఆడి తన వికెట్‌ను తానే సమర్పించుకున్నాడు. అంత సేపు పిచ్‌లో నిలబడి, 135 బంతులు ఆడి, గంటల కొద్ది క్రీజ్‌లో గడిపిన తర్వాత కూడా స్మిత్ ఒక పూర్ డెలవరీకి అవుట్ కావడం అందర్ని ఆశ్చర్యానికి గురి చేసింది. రోజుల తరబడి బ్యాటింగ్ చేసే సత్తా ఉన్న స్మిత్.. అప్పటికే క్రీజ్‌లో పాతుకుపోయి కూడా చెత్త షాట్ ఆడి వికెట్ సమర్పించుకున్నాడు. ఈ అవుట్‌తో స్మిత్ ఈ సిరీస్‌లో మూడు సార్లు జడేజాకే అవుట్ అయ్యాడు. మరి ఈ మ్యాచ్‌లో స్మిత్ అవుట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Jadeja has taken Labuschagne 4 times & Smith 3 times in BGT 2023.
What a great cricketer. pic.twitter.com/Hdqofblqgf
— Johns. (@CricCrazyJohns) March 9, 2023