టీమిండియా క్రికెటర్, స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. ఇప్పటి వరకు బ్యాట్ పట్టి, బంతి విసిరి మైదానంలో తన సత్తా చాటిన జడ్డు. తాజాగా రెండు చేతులు జోడించి.. తన భార్యకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించాడు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో జడేజా భార్యా రీవాబా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. నార్త్ జామ్‌నగర్ నుంచి ఆమె బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో తన భార్యను భారీ మెజార్టీతో గెలిపించాలని జడేజా ఒక వీడియోలో మాట్లాడ.. ఆ వీడియోను సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్టు చేశాడు. క్రికెటర్‌గా జడేజాగా చాలా మంది అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. దీంతో జడేజా ప్రచారం తన భార్యకు మేలు చేస్తుందన్న ఉద్దేశంతో ఈ వీడియో రిలీజ్ చేసినట్లు తెలుస్తుంది. ఈ వీడియోలో జడేజా పూర్తిగా గుజరాతీలో మాట్లాడి మెప్పించాడు.
కాగా.. జడేజాతో రీవాబాకు 2016లో వివాహం జరిగింది. రీవాబా మూడేళ్ల క్రితమే భారతీయ జనతా పార్టీలో చేరి చురగ్గా పనిచేస్తున్నారు. ఆమె కర్ణి సేన నాయకురాలు కూడా.. ప్రముఖ రాజకీయ నేత హరిసింగ్ సోలంకికి రీవాబా చాలా దగ్గరి బంధువు. 32 ఏళ్ల రీవాబా 1990 సెప్టెంబర్ 5వ తేదీన జన్మించారు. ఆమె మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. కాగా రాజకీయాలపై ఉన్న ఆసక్తితోపాటు తమ బంధువులకు రాజకీయ నేపథ్యం ఉండటంతో ఆమె కూడా అటువైపే అడుగులు వేశారు. కాగా.. టీమిండియాలో స్టార్ క్రికెటర్‌గా ఉండి కూడా జడేజా.. తన భార్యను రాజకీయాల్లోకి వెళ్లనివ్వడంపై జడేజాపై కూడా ప్రశంసలు కురుస్తున్నాయి. కాగా.. ఇటివల ఆస్ట్రేలియా వేదికగా ముగిసిన టీ20 వరల్డ్ కప్ 2022లో జడేజా గాయం కారణంగా పాల్గొనలేకపోయాడు.
જામનગર ના મારા તમામ મિત્રો ને મારુ દીલ થી આમંત્રણ છે. જય માતાજી🙏🏻 pic.twitter.com/olZxvYVr3t
— Ravindrasinh jadeja (@imjadeja) November 13, 2022