భారత్-శ్రీలంక మధ్య మొహాలీ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. 8 వికెట్లు కోల్పోయి 574 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా భారీ సెంచరీతో భారత్ ఈ స్కోర్ సాధించగలిగింది. 228 బంతుల్లో 19 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో జడేజా 175 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. భారత్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయకుంటే జడేజా కచ్చితంగా డబుల్ సెంచరీ బాదేవాడు. కాగా టీమ్ వ్యూహం ప్రకారం ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయాల్సి వచ్చింది. అయినా కూడా ఈ భారీ ఇన్నింగ్స్‌తో జడేజా ఒక భారీ రికార్డును బద్ధలు కొట్టాడు. 36 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసి సరికొత్త చరిత్రను లిఖించాడు.
భారత్‌కు తొలిసారి వన్డే వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ కపిల్‌దేవ్ నెలకొల్పిన భారీ రికార్డును జడేజా బద్దలుకొట్టాడు. 1986లో కపిల్‌దేవ్ 7వ స్థానంలో బ్యాటింగ్ వచ్చి.. 168 పరుగులు చేశారు. భారత్ తరపున 7వ స్థానంలో వచ్చిన బ్యాట్స్‌మెన్ చేసిన అత్యధిక స్కోర్ ఇదే. కానీ 2019లో ఈ రికార్డును టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ బ్రేక్ చేసేలా కనిపించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో 7వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన పంత్ 156 పరుగుల చేసి అవుట్ అయ్యాడు. ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో జడేజా కపిల్‌దేవ్ రికార్డును బ్రేక్ చేసి.. టెస్టుల్లో భారత్ తరపున 7వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 175 పరుగులు చేసి అజేయంగా నిలిచి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. మరి ఈ రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
record break pic.twitter.com/9i3iq4yR1D
— Sayyad Nag Pasha (@PashaNag) March 5, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App ని డౌన్లోడ్ చేసుకోండి.