ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్టు ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ ప్లేయర్ రవీంద్ర జడేజా నంబర్‌వన్ స్థానానికి దూసుకెళ్లాడు. జడేజా ఖాతాలో ప్రస్తుతం 406 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. మొహాలీ వేదికగా శ్రీలంక తో జరిగిన మ్యాచులో బ్యాటింగ్ లో 175 పరుగులు, బౌలింగ్ లో 9 వికెట్లు తో రాణించిన జడేజా ఐసీసీ టెస్టు ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానికి ఎగబాకాడు. తరువాతి స్థానాల్లో వెస్టిండీస్ మాజీ కెప్టెన్ జేసన్ హోల్డర్ (382 రేటింగ్ పాయింట్లు), టీమిండియా ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ (347 రేటింగ్ పాయింట్ల)తో కొనసాగుతున్నారు.
ఐసీసీ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా బౌలర్ పాట్ కమ్మిన్స్(892 రేటింగ్ పాయింట్లు) అగ్రస్థానంలో కొనసాగుతుండగా, రవిచంద్రన్ అశ్విన్(850 రేటింగ్ పాయింట్ల) తో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక.. ఐసీసీ టెస్టు బ్యాటర్ ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లాబుస్చాగ్నే(936 రేటింగ్ పాయింట్లు) ఫస్ట్ ప్లేసులో కొనసాగుతుండగా, టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(763 రేటింగ్ పాయింట్లు), టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(761 రేటింగ్ పాయింట్ల)తో 5,6 స్థానాల్లో కొనసాగుతున్నారు.
ఇది కూడా చదవండి :CSK నెట్ ప్రాక్టీస్ లో ధోని వీర బాదుడు! సింగిల్ హ్యాండ్‌తో సిక్స్!
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో టీమిండియా 270 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఇక.. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా 119 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, టీమిండియా 116 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఇక వన్డే ర్యాంకింగ్స్ లో న్యూజిలాండ్ 121 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, టీమిండియా 110 రేటింగ్ పాయింట్లతో నాల్గవ స్థానంలో కొనసాగుతోంది.
ఐసీసీ ర్యాంకింగ్స్ జట్లు
టెస్టు వన్డే టీ20
1. ఆస్ట్రేలియా 1. న్యూజిలాండ్ 1. ఇండియా
2. ఇండియా 4. ఇండియా 2. ఇంగ్లాండ్
Jadeja reaches the summit 👑
Kohli, Pant move up ⬆️Some big movements in the latest update to the @MRFWorldwide ICC Men’s Test Player rankings 📈
Details 👉 https://t.co/BjiD5Avxhk pic.twitter.com/U4dfnrmLmE
— ICC (@ICC) March 9, 2022