టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఏకంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను దారుణంగా ట్రోల్ చేశాడు. న్యూజిలాండ్ క్రికెటర్ ఫ్లెమింగ్ ఫ్లాట్ పిచ్‌లపై చేసిన వ్యాఖ్యలకు.. టీమిండియా మాజీ క్రికెటర్లు మురళీ కార్తీక్, జహీర్ ఖాన్ ఇచ్చిన కౌంటర్ గురించి స్పందిస్తూ.. అశ్విన్ ఒక ట్వీట్ చేశాడు. ఫ్లాట్ పిచ్‌ల గురించి మాట్లాడుతున్న ఫ్లెమింగ్‌కు 2002లో ఇండియా న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లినప్పుడు ఆ జట్టు స్పిన్నర్ డానియల్ వెటోరీ కనీసం ఒక్క ఓవర్ కూడా వేయలేదనే విషయాన్ని చాలా బాగా గుర్తు చేశారని పేర్కొన్నాడు. ఈ ట్వీట్‌కు రోహిత్ శర్మ అభిమాని ఒకతను రిప్లయ్ ఇస్తూ.. ‘అన్న వన్ ప్లేట్ ఇడ్లీ సాంబార్’ అంటూ అర్థంలేని ట్వీట్ చేయడంతో మండిపోయిన అశ్విన్.. వడా? అని బదులిచ్చాడు.
అశ్విన్ చెన్నైకు చెందిన వ్యక్తి కనుక వారిని.. ఇడ్లీ సాంబార్ అంటుంటారు. అందుకే రోహిత్ అభిమాని అశ్విన్ ట్వీట్ కాస్త ఎటకారంగానే బదులిచ్చాడు. అందుకు తగ్గట్లే అశ్విన్ సైతం కౌంటర్ ఇచ్చాడు. అయితే.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫిట్‌గా ఉండడు.. మైదానంలో చాలా బద్దకంగా కదులుతాడనే అవవాదు ఉంది. అందుకే అతన్ని కొంతమంది వడాపావ్ అంటూ ట్రోల్ చేస్తుంటారు. ఇప్పుడు అశ్విన్ కూడా రోహిత్ ఫ్యాన్‌కు కౌంటర్ ఇచ్చేందుకు అతని అభిమాన ఆటగాడిని ట్రోల్ చేశాడు. ప్రస్తుతం అశ్విన్ చేసిన ట్వీట్ సోసల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్రికెట్ అభిమానులు మాత్రం అశ్విన్ చేసిన ట్వీట్‌ను సమర్థిస్తున్నారు. నెటిజన్‌కు బుద్ధి చెప్పేందుకే అశ్విన్ అలా అన్నాడే తప్ప.. రోహిత్‌ను అనాలని కాదని అంటున్నారు.
కాగా.. రోహిత్ శర్మ కెప్టెన్సీలోని టీమిండియా టీ20 వరల్డ్ కప్‌లో విఫలమైన విషయం తెలిసిందే. సూపర్ 12 స్టేజ్‌లో నాలుగు విజయాలతో టేబుల్ టాపర్‌గా నిలిచిన టీమిండియా.. సెమీస్‌లో మాత్రం ఇంగ్లండ్ చేతిలో దారుణ ఓటమిని చవిచూసింది. ఏకంగా 10 వికెట్ల తేడాతో ఓడి.. టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆ తర్వాత రోహిత్‌తో పాటు సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, అశ్విన్, షమీ, దినేస్‌కార్తీక్, కేఎల్ రాహుల్‌లకు విశ్రాంతి ఇచ్చిన బోర్డు.. హార్దిక్ పాండ్యా, శిఖర్ ధావన్ కెప్టెన్సీల్లో యువ జట్లను న్యూజిలాండ్‌తో వన్డే, టీ20 సిరీస్‌లకు పంపించింది. కాగా.. మరికొన్ని రోజుల్లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా బంగ్లాదేశ్‌తో వన్డే, టెస్టు సిరీస్‌లు ఆడనుంది.
Quality banter from Stephen Fleming, @kartikmurali and @ImZaheer . Flem talking about flat wickets when india come for a series to NZ and our boys reminding him about the 2002 series where Dan Vettori dint bowl a single over.👏 😂😂#indvsnz @PrimeVideo
— Ashwin 🇮🇳 (@ashwinravi99) November 30, 2022