బంగ్లా గడ్డపై టీమిండియా టెస్ట్ సిరీస్ నెగ్గడంలో రవిచంద్రన్ అశ్విన్ కీలక పాత్ర పోషించాడు. బౌలింగ్‌లోనే కాకుండా.. కీలక సమయాల్లో బ్యాటింగ్‌లోనూ రాణించాడు. రెండో టెస్టులో 74 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమి తప్పదనుకున్న సమయంలో.. అయ్యర్ తో కలిసి అతడు నెలకొల్పిన భాగస్వామ్యం విలువ కట్టలేనిది. 8 వ వికెట్ కు ఏకంగా 71 పరుగులు జోడించి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అయినా అతనిపై వచ్చే విమర్శలకు కొదవలేదు. వయసు పైబడిందని కామెంట్ చేసేవారు కొందరైతే.. మన్కడింగ్ చేసుకో అంటూ హేళన చేసే వారు మరికొందరు. తాజాగా, అశ్విన్ కు ఇలాంటి అనుభూతే మరోసారి ఎదురైంది. ఈ క్రమంలో అతడు తనదైన శైలిలో సమాధానమిచ్చాడు.
సోషల్ మీడియాలో అత్యంత చురుగ్గా ఉండే క్రికెటర్లలో రవిచంద్రన్ అశ్విన్ ఒకడు. తన కంట పడ్డ వినూత్నమైన వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు. అంతేకాదు.. అభిమానుల సందేహాలకు సమాధానాలు ఇస్తూ, శృతిమించిన వారిని బ్లాక్ చేస్తుంటాడు. అయితే.. అశ్విన్ ను ‘అతిగా ఆలోచిస్తాడు..’ అని కామెంట్స్ చేస్తుంటారట. ఈ మధ్యకాలంలో ఈ విషయంపై పలు ఆర్టికల్స్ కూడా వచ్చాయట. దీంతో సహనం కోల్పోయిన అశ్విన్, విమర్శకుల నోరు మూయించేలా సమాధానమిచ్చాడు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశాడు.
“అతిగా ఆలోచించడం అనేది.. నేను భారత జెర్సీ వేసుకుంటునప్పటి నుంచి అనుసరిస్తున్నా. బయట నుంచి నాపై “అతిగా ఆలోచిస్తాడు..” అంటూ వ్యాఖ్యలు చేస్తుంటారు. అలా అన్నప్పుడు నేను కూడా దాని గురించి ఆలోచిస్తుంటా. అయితే నేను ఆడే ఆటపై నాకంటూ స్పష్టత ఉంటుంది. ఇలాగే ఆడాలని ఇతరులను రికమండ్ చేయను. నా ఆట గురించే ఆలోచిస్తా. అలాగే నా అభిప్రాయాలను అందరితో పంచుకుంటా. అవన్నీ మీకు నచ్చకపోవచ్చు. చివరిగా ఓ మాట చెప్తున్నా.. నా సహచరులు, అభిమానులు లేదా ఇతరుల నుంచి నాకెలాంటి సమస్య లేదు. ఇలా నేను ట్వీట్లు పెట్టడానికి కారణం కూడా ఓ కారణముంది. గత కొంతకాలంగా నాపై వస్తున్న కొన్ని ఆర్టికల్స్‌పై స్పందించాల్సిన బాధ్యత నాపై ఉంది. అందుకే ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది..” అంటూ అని అశ్విన్ సుదీర్ఘంగా పోస్టులు పెట్టాడు.
Finally, I think deeply about the game and share my views because I believe when ideas are shared they can multiply into miraculous achievements. The fact that it may not be popular won’t deter me cos my goal is not to win the war of words, it is to learn at the end of it.
— Ashwin 🇮🇳 (@ashwinravi99) December 25, 2022
“Overthinking” is a perception that has followed me ever since I wore the Indian jersey with pride. I have pondered about it for a while now and believe I should have seriously considered a PR exercise to erase that word out of peoples minds. Every person’s journey is special
— Ashwin 🇮🇳 (@ashwinravi99) December 25, 2022
అశ్విన్ గత కొంతకాలంగా జట్టుకు భారంగా మారాడనే విమర్శలు వస్తున్నాయి. టీ20 ప్రపంచకప్‌లో పెద్దగా రాణించకపోయినా అన్ని మ్యాచ్‌ల్లో ఆడే అవకాశం అశ్విన్‌కు దక్కింది. అలాగే యువ స్పిన్నర్లను కాదని సీనియర్‌కు చోటు కల్పించడంపైనా విమర్శలు రేగాయి. ఈ క్రమంలో తనకు తాను ఎక్కువగా అంచనా వేసుకొంటూ ‘అతిగా ఆలోచిస్తున్నాడు’ అంటూ పలు కామెంట్లు రావడంతో అశ్విన్ ఘాటుగా స్పందించాడు. 400లకు పైగా వికెట్లు, 3 వేలకు పైగా పరుగులు చేసిన అతి కొద్ది మంది ప్లేయర్లలో అశ్విన్ ఒకడు. అయితే ఇంత చేసినా అశ్విన్ స్టార్ స్టేటస్‌కి ఆమడ దూరంలో మిగిలిపోయాడు. టీమిండియాకి ఎన్నో విజయాలు అందిస్తున్నా అశ్విన్‌కి రావాల్సిన క్రేజ్ రావడం లేదు కదా. ఈ విమర్శలు ఎక్కువయిపోయాయి.
3000+ runs & 400+ wickets in Test cricket: One & only Ravichandran Ashwin.
The man, The Myth, The Legend. pic.twitter.com/GPImG7ooIh
— Johns. (@CricCrazyJohns) December 25, 2022