టీ20 వరల్డ్ కప్ 2022 ముగిసిన ఐదు రోజుల వ్యవధిలోనే టీమిండియా మరో సిరీస్‌కు సిద్ధమైంది. భారత జట్టు వరల్డ్ కప్ టోర్నీలో ఉండగానే న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌తో సిరీస్‌లకు సెలెక్టర్లు జట్లను ప్రకటించిన విషయం తెలిసిందే. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌తో పాటు సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, అశ్విన్, షమీ, దినేష్ కార్తీక్‌లకు రెస్ట్ ఇచ్చిన సెలెక్టర్లు.. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో యువ ఆటగాళ్లతో కూడిన టీమిండియా న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు పంపించారు. కానీ.. శుక్రవారం జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయిన విషయం తెలిసిందే. అయితే.. న్యూజిలాండ్‌తో టీ20 వన్డే సిరీస్‌లకు పలువురు సీనియర్ ఆటగాళ్లతో పాటు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, సపోర్టింగ్ స్టాఫ్‌కు కూడా విశ్రాంతి ఇచ్చారు.
ఇలా కోచ్, సపోర్టింగ్ స్టాఫ్‌కు రెస్ట్ ఇవ్వడంపై టీమిండియా మాజీ హెడ్ కోచ్, కామెంటేటర్ రవిశాస్త్రి అభ్యంతరం వ్యక్తం చేశాడు. అసలు సపోర్టింగ్ స్టాఫ్‌కు రెస్ట్ ఎందుకని.. ఐపీఎల్ సమయంలో ఎలాగో రెండు నెలల రెస్ట్ దొరుకుతుంది కాదా.. తాను కోచ్‌గా ఉంటే రెస్ట్ తీసుకోను అని, యువ క్రికెటర్లను మరింత దగ్గర పరిశీలిస్తానని రవిశాస్త్రి పేర్కొన్నాడు. అయితే రవిశాస్త్రి వ్యాఖ్యలపై స్పందించిన టీమిండియా సీనియర్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ ద్రవిడ్‌కు మద్దతుగా నిలిచాడు. ఆటగాళ్లతో పాటు కోచ్, సపోర్టింగ్ స్టాఫ్‌కు సైతం కచ్చితంగా విశ్రాంతి ఇవ్వాల్సిన అవరసం ఉందని పేర్కొన్నాడు. వారికి ఎందుకు రెస్ట్ ఇవ్వాలో కూడా తన వద్ద కారణాలు ఉన్నాయని అశ్విన్ పేర్కొన్నాడు.
అశ్విన్ మాట్లాడుతూ..‘వీవీఎస్ లక్ష్మణ్ పూర్తిగా ఒక కొత్త జట్టుతో న్యూజిలాండ్ వెళ్లారు. అది పూర్తిగా కొత్తగా ఆ జట్టును అర్థం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. అలాగే.. ద్రవిడ్ తమతో పాటు టీ20 వరల్డ్ కప్ 2022 కోసం కొన్ని నెలల ముందు నుంచే సిద్ధమవుతూ వచ్చారు. వరల్డ్ కప్ టోర్నీలో ఎలాంటి ప్లాన్ ప్రకారం ఆడాలి, ఏ వేదికపై, ఏ ప్రత్యర్థిపై ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళ్లాలో ద్రవిడ్ అండ్ కో దగ్గర కచ్చితమైన ప్లాన్ ఉంది. వాటి కోసం వారు ఎంతో శ్రమించారు. దాదాపు ఏడాది నుంచి వరల్డ్ కప్ కోసం చాలా ప్రణాళికలు రచించారు. దాంతో వారు మానసికంగానే కాక శారీరంగా కూడా అలసిపోయారు. అందుకే వారికి కచ్చితం రెస్ట్ ఇవ్వాలి. పైగా న్యూజిలాండ్ సిరీస్ తర్వాత వెంటనే.. బంగ్లాదేశ్‌తో సిరీస్ ఉంది. ఆ విషయం కూగా గుర్తుంచుకోవాలి.’ అని అశ్విన్ పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలతో ద్రవిడ్‌కు రెస్ట్ ఎందుకన్న మాజీ కోచ్ రవిశాస్త్రికి అశ్విన్ కౌంటర్ ఇచ్చినట్లుగా ఉందని క్రికెట్ అభిమానులు పేర్కొంటున్నారు.
🚨 R Ashwin defends Rahul Dravid for taking a break, differs with former coach Ravi Shastri pic.twitter.com/IGh3497jgq
— MegaNews Updates (@MegaNewsUpdates) November 19, 2022