జెంటిల్ మ్యాన్ గేమ్ గా పిలవబడే.. క్రికెట్ ప్రస్థానం ఎప్పుడు మొదలైందో తెలియదు కానీ, మనదేశంలో క్రికెట్ ప్రస్థానం మొదలైంది మాత్రం 1983 తర్వాతే. దేశానికి.. కపిల్ దేవ్.. వరల్డ్ కప్ అందించే వరకు మనదేశంలోక్రికెట్ గురుంచి తెలిసిన వారి సంఖ్య లక్షల్లోనే ఉండేది. నేడు ఆ సంఖ్య కొట్లకు చేరింది. అలాంటి క్రికెట్ ప్రపంచంలో.. నాటి నుంచి నేటివరకు ఎన్నో మార్పులొచ్చాయి. ఆ మార్పులు సరిపోవని చెప్తూ.. మరిన్ని విప్లవాత్మక మార్పులు రావాలని టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి సూచిస్తున్నాడు.
‘అంతర్జాతీయ క్రికెట్ లో ఇప్పటివరకు ఎన్నో మార్పులొచ్చాయి. అవన్నీ సాగగతిస్తూనే.. మరిన్ని మార్పుల దిశగా మనం ఆలోచించాలి. క్రమంగా టెస్టులకు, వన్డేలకు ఆదరణ తగ్గి.. టీ20లు చూడడానికి ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఆ దిశగా మార్పులు రావాలి. ద్వైపాక్షిక సిరీసులు ఆడటం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. టీ20లకు ఎక్కువ ఆదరణ చూపాలి. ఏడాదికి రెండు ఐపీఎల్ సీజన్లు నిర్వహించేలా ఆలోచించాలి. అలా చేస్తే మరింత మంది కొత్త ఆటగాళ్లకు అవకాశం లభిస్తుంది. భవిష్యత్తు టీ20లదే! ఫ్రాంచైజీ క్రికెట్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఆ దిశగా అడుగులు పడాలి’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.
With the IPL likely to get bigger soon, Ravi Shastri stated that international T20s should only be played at World Cups 🗣
Do you agree? #T20Timeout #IPL2022
— ESPNcricinfo (@ESPNcricinfo) June 1, 2022
ఆటగాళ్లపై ద్వైపాక్షిక సిరీసుల భారం తగ్గించాలని రవిశాస్త్రి చాన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్నాడు. “టీ20 క్రికెట్ లో చాలా ద్వైపాక్షిక సిరీసులు జరుగుతున్నాయి. టీమిండియాకు కోచ్‌గా ఉన్నప్పుడూ నేనిదే మాట చెప్పాను. ఇప్పుడూ అదే చెప్తున్నాను. మన కళ్ల ముందరే ఫ్రాంచైజీ క్రికెట్ డెవలప్ అవ్వడం చూస్తున్నాం. క్రికెట్ కచ్చితంగా ఫుట్‌బాల్ బాట పట్టాల్సిందే. టీ20 క్రికెట్ లో కేవలం ప్రపంచకప్ మాత్రమే ఆడాలి. ద్వైపాక్షిక మ్యాచులను ఎవరూ గుర్తు పెట్టుకోరు’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.
🗣️No one remembers bilateral matches – #ravishastri #INDvSA #IPL #IPL2022 pic.twitter.com/7oAhUdFIZj
— SportsCafe (@IndiaSportscafe) June 2, 2022
‘టీమిండియా కోచ్‌గా ఐసీసీ ప్రపంచకప్‌లు తప్పా నాకు ఇంకే మ్యాచులూ గుర్తు లేవు. నాకే కాదు.. ఎవరు గుర్తుంచుకోరు. మెగా టోర్నీని గెలిచిన జట్టే దానిని గుర్తుంచుకుంటాయి. దురదృష్టవశాత్తు మనం గెలవలేదు కాబట్టి మనం గుర్తుంచుకోం. నా ఉద్దేశంలో ప్రతి దేశం సంవత్సరం పొడవునా ఫ్రాంచైజీ క్రికెట్ నిర్వహించాలి. దేశవాళీ క్రికెట్ తరహాలోనే ఇది ఉండాలి. ఆ తర్వాత ప్రతి రెండేళ్లకు ప్రపంచకప్ ఆడాలి’ అని రవిశాస్త్రి వెల్లడించాడు.
ఇది కూడా చదవండి: Virender Sehwag: ‘ఆ రోజు సచిన్ లేకుంటే ఏం జరిగేదో’.. ధోనీపై షాకింగ్ కామెంట్స్ చేసిన సెహ్వాగ్!
ఒక కోచ్‌గా రవిశాస్త్రి విజయవంతం అయ్యాడనే చెప్పాలి. టెస్టు క్రికెట్లో టీమ్‌ఇండియాను ఎదురులేని జట్టుగా మలిచాడు. విదేశీ పిచ్‌లపై ఫిర్యాదు చేయకుండా వాటిపై ఆడేలా జట్టును తయారు చేశాడు. అయితే ఐసీసీ ట్రోఫీలు అందించకపోవడం మాత్రం అసంతృప్తే. ఆ విషయం అతడికీ తెలుసు. ఏదేమైనా అతడు టీమ్‌ఇండియాకు చేసిన సేవకు రవిశాస్త్రికి కృతజ్ఞతలు తెలపాల్సిందే. మరి.. ఏడాదికి రెండు సార్లు ఐపీఎల్ నిర్వహించాలనడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.