టీమిండియా మాజీ క్రికెటర్, హెడ్ కోచ్ రవిశాస్త్రి భారత ఆటగాళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గాయపడిన ఆటగాళ్లంతా ఆశ్చర్యకరంగా ఐపీఎల్ వేలానికి ముందు ఫిట్‌గా మారిపోతారని బాంబు పేల్చారు. దీనిని బట్టి ఆటగాళ్లకు ఐపీఎల్ ఓ గొప్ప ఫిజియోథెరపిస్ట్‌లా పని చేస్తుందని ఎద్దేవా చేశారు. కాసులు కురిపించే ఐపీఎల్ అంటే కొంతమందికి పిచ్చిలా మారిందని అన్నారు. ఇది తన భావన మాత్రమే కాదని, చాలా మంది క్రికెట్ వర్గాల్లో కూడా ఇదే భావని ఉందని చెప్పారు. సాధారణ ప్రజలు సైతం ఇదే అనుకుంటున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఐపీఎల్‌లో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు డబ్బుల గురించి మరిచిపోయి ఆటపై దృష్టి పెట్టాలని సూచించారు.
యువ ఆటగాళ్లపై ఒత్తిడి తగ్గించే బాధ్యత జట్టు కెప్టెన్లపై తప్పకుండా ఉంటుందని రవిశాస్త్రి తెలిపాడు. ఇక భారత జాతీయ జట్టుకు భవిష్యత్‌లో కెప్టెన్సీ చేయాలని ఆశిస్తున్న ఆశావాహులు ఐపీఎల్‌లో మంచి ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఐపీఎల్‌లో కెప్టెన్లుగా ఉన్న రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్‌కు భవిష్యత్‌లో టీమిండియా కెప్టెన్సీ చేపట్టడానికి అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఇక ప్రస్తుతం రోహిత్ శర్మ టీమిండియాను అద్భుతంగా నడిపిస్తున్నాడని కొనియాడారు.ఐపీఎల్‌తో కొత్త ఆటగాళ్లను కనిపెట్టడం సులభమైందని అన్నారు. హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేస్తాడా? లేదా? అని ఈ ఐపీఎల్‌లో అతడిని దేశమంతా గమనిస్తుందని రవిశాస్త్రి చెప్పాడు. కాగా శాస్త్రి.. పాండ్యాను టార్గెట్ చేసుకుని ఈ వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. వెన్నునొప్పి కారణంగా బౌలింగ్ దూరమైన పాండ్యా.. ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. మరి రవిశాస్త్రి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: రాయుడి విషయంలో తప్పు జరిగింది! సంచలన నిజాలు బయటపెట్టిన రవిశాస్త్రి!
I think this #IPL2022, India will be looking at who will be captaining the team (in future): #RaviShastri #TeamIndia https://t.co/hufxEWuhj6
— Zee News English (@ZeeNewsEnglish) March 22, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.