అంబటి రాయుడు.. అద్భుతమైన టాలెంట్ ఉన్న క్రికెటర్. ఐపీఎల్‌లో అదరగొడుతున్నప్పటికీ జాతీయ జట్టులో సరైన అవకాశాలు రాకుండా నిరాదరణకు గురైన తెలుగు ఆటగాడు. 2019 వన్డే వరల్డ్ కప్ సమయంలో కచ్చితంగా జట్టులో చోటు దక్కుతుందని భావించినప్పటికీ.. దక్కలేదు. ఈ విషయంలో రాయుడితో పాటు యావత్ క్రికెట్ ప్రపంచం ఆశ్చర్యపోయింది. తాజాగా ఇదే విషయంపై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించారు.
2019 ప్రపంచకప్‌కు అంబటి రాయుడిని సెలెక్ట్ చేసుంటే బాగుండేదని టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. రాయుడికి ఆ టైమ్‌లో అన్యాయం జరిగిందని ఆయన అంగీకరించినట్టు ఆయన వ్యాఖ్యలను బట్టి అర్థం చేసుకోవచ్చు. అలాగే రాయుడిని ఎంపిక చేయకపోవడం వెనుక తన ప్రమేయం ఏమీ లేదన్నాడు. వరల్డ్ కప్ జట్టులో స్థానం దక్కకపోవడంతో తీవ్ర మనోవేదనకు లోనైన అంబటి రాయుడు బీసీసీఐపై కోపంతో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కానీ తర్వాత తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఇక రాయుడు అద్భుత ప్రదర్శన కనబర్చినప్పుడల్లా ఈ త్రీడీ వ్యవహారం చర్చనీయాంశమవుతోంది. అలాగే జట్టులో ధోనీ, దినేశ్ కార్తీక్, రిషభ్ పంత్ ముగ్గురు వికెట్ కీపర్లను ఎందుకు ఎంపిక చేశారో తనకు ఇప్పటికీ అర్థం కాదని రవిశాస్త్రి అన్నారు.
Former head coach #RaviShastri (@RaviShastriOfc) has said that picking three wicket-keepers in India’s 2019 ODI World Cup squad was not logical and either Ambati Rayudu or Shreyas Iyer could have been picked for the mega event in England. pic.twitter.com/IE05ueyNu5
— IANS Tweets (@ians_india) December 10, 2021
ఇక తన హయాంలో ఒక్క ఐసీసీ టైటిల్ గెలవకపోవడం కూడా చాలా బాధగా ఉందన్నాడు. ఇక విరాట్ కోహ్లీ స్థానంలో కెప్టెన్‌గా రోహిత్ శర్మ బాధ్యతలు చేపట్టడంపై ఆనందం వ్యక్తం చేసిన రవిశాస్త్రి అతడికి పలు సూచనలు చేశాడు. ‘రోహిత్ అనవసర విషయాలకు స్పందించాల్సిన అవసరం లేదు. పరిస్థితులను బట్టి జట్టుకు ఏది అవసరమో అదే చేస్తూ ముందుకు సాగాలి. జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడిని సమర్థంగా ఉపయోగించుకుంటేనే విజయవంతమైన నాయకుడిగా రాణించగలుగుతాడు’ అని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. మరి రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.