జమ్ము ఎక్స్ ప్రెస్ ఉమ్రాన్ మాలిక్.. అనతికాలంలోనే టీమిండియాలో స్థానం సంపాదించాడు. సౌత్ ఆఫ్రికా సిరీస్ లో టీ20ల్లో అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్నాడు. ఐపీల్ 2022 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున తన సత్తాచాటి టీమిండియాలోకి అడుగుపెట్టాడు. కానీ, అక్కడి నుంచి ప్లేయింగ్ 11లో స్థానం సంపాదించడం అంత తేలికేం కాదు. పైగా ఉమ్రాన్ మాలిక్ ఇంకా కఠోర శ్రమ చేయాలంటూ కోచ్ ద్రావిడ్, మాజీలు సైతం ఉమ్రాన్ మాలిక్ కు అప్పుడే అవకాశం కల్పించడం సరికాదు.. అంటూ పరోక్ష వ్యాఖ్యలు చేయడం చూశాం. ఇప్పుడు వారితో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా గొంతు కలిపాడు.
ఎప్పుడెప్పుడు టీమిండియా తరఫున ఆడతాడా అని అభిమానులు, ఉమ్రాన్ మాలిక్ ఎదురు చూస్తుండగా.. అది ఇప్పుడల్లా సాధ్యం కాదేమో అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తాజాగా ఉమ్రాన్ రవిశాస్తిర చేసిన వ్యాఖ్యలు ఆ అనుమానానికి మరింత బలం చేకూర్చాయి. ఉమ్రాన్ ను టీ20 ప్రపంచకప్ కు సెలక్ట్ చేయకండి.. అంతను ఇంకా పిల్లాడే.. అప్పుడే నెత్తిన పెట్టుకోకండి అనే రీతిలో రవిశాస్త్రి వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.
‘ఉమ్రాన్ మాలిక్ కు ఇంకా టీ20ల్లో అంత అనుభవం రాలేదు. ఇంకా అతడిని తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆస్ట్రేలియాలో జరగబోతున్న టీ20 ప్రపంచకప్ కు సెలక్టర్లు ఉమ్రాన్ మాలిక్ ను ఎంపిక చేయకండి. అతడిని వైట్ బాల్ క్రికెట్ కొన్నాళ్లపాటు ఆడనివ్వండి. టెస్టుల్లోనూ ఉమ్రాన్ మాలిక్ కు అవకాశం ఇచ్చి.. ఎలాంటి ప్రదర్శన చేయగలుగుతున్నాడో చూడాలి’ అంటూ రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు.
బీసీసీఐ ప్రస్తుతం యువ ఆటగాళ్లపై దృష్టి పెట్టింది. ఐపీఎల్ 2022 సీజన్లో అద్భుత ప్రదర్శన చేసిన కొందరు ఆటగాళ్లను ఎంపిక చేసి తీర్చిదిద్దే పనిలో పడింది. అందులో భాగంగానే ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్ లను సఫారీలపై సిరీస్ కు సెలక్ట్ చేసి టీమిండియా క్యాంప్ లో శిక్షణ ఇస్తున్నారు. ఉమ్రాన్ కు ప్రపంచ కప్ కు సెలక్ట్ చేయకండన్న రవిశాస్త్రి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
💬 💬 “A dream come true moment to get India call up.”
Umran Malik speaks about the excitement on being a part of the #TeamIndia squad, Day 1 at the practice session, his idols and goals ahead. 👍 👍 – By @28anand
Full interview 🎥 🔽 #INDvSA | @Paytm pic.twitter.com/V9ySL4JKDl
— BCCI (@BCCI) June 8, 2022