సంజూ శాంసన్.. పొట్టి క్రికెట్ లో ముఖ్యంగా ఐపీఎల్ లో మంచి రికార్డులు శాంసన్ సొంతం. ఐపీఎల్ 2022 సీజన్లోనూ రాజస్థాన్ రాయల్స్ జట్టును ఫైనల్ చేర్చడంలో కెప్టెన్ గా సంజూ శాంసన్ కీలక పాత్ర పోషించాడు. అటు బ్యాట్స్ మన్ గా కూడా సంజూ శాంసన్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఇంతా చేసినా సంజూ శాంసన్ కూ మాత్రం సౌత్ ఆఫ్రికా సిరీస్ లో చోటు దక్కలేదు. సంజూ శాంసన్ కు అవకాశం ఇవ్వకపోవడాన్ని అభిమానులు బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు. టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రిలాంటి వారైతే సంజూ శాంసన్ కంటే తోపులు ఏమీ లేరంటూ ఓపెన్ కామెంట్స్ చేస్తున్నారు.
సంజూ శాంసన్ పై టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. మరోవైపు ఆస్ట్రేలియా జరగబోయే టీ20 వరల్డ్ కప్ కు సంజూ శాంసన్ ను తప్పకుండా తీసుకోవాలంటూ సెలక్టర్లకు బాహంటంగానే సూచన కూడా చేశాడు. సంజూ శాంసన్ లాంటి ప్లేయర్ ఆస్ట్రేలియా పిచ్ లపై అద్భుతంగా రాణించగలడని కితాబిచ్చాడు.
Ravi Shastri (in Espn Cricinfo) said “Sanju Samson has got more shots than many Indian players in Australia for the T20 World Cup”. pic.twitter.com/1syrKHFymL
— sarswat (@sarswat7_) June 8, 2022
‘సంజూ శాంసన్ ఎంతో టాలెంట్ ఉన్న ప్లేయర్. సంజూ అమ్ముల పొదిలో ఎన్నో రకాల షాట్స్ ఉన్నాయి. ఇండియన్ క్రికెట్ లోనే అలాంటి షాట్స్ ఆడగల ప్లేయర్ ఎవరూ లేరు. ఆస్ట్రేలియా లాంటి బౌన్స్, పేస్, పుల్, కట్ వంటి పిచ్ లపై సంజూ శాంసన్ ప్రత్యర్థికి సవాళ్లు విసరగలడు. ఆస్ట్రేలియాలో వరల్డ్ కప్ కోసం సెలక్టర్లు సంజూ శాంసన్ ను పరిగణలోకి తీసుకుంటే బావుంటుంది’ అంటూ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు.
Ravi Shastri (Former coach ICT) – If you look at Australia, bounce, pace, cut, pull, Samson will always threaten there. For that conditions, he has more shots than any other Indian, to be honest,”.
So Sanju fans remember one thing: God’s mill grinds slowly but surely pic.twitter.com/JmTseCVHih
— Rockstar MK (@RockstarMK11) June 9, 2022
మరోవైపు కోహ్లీ, రోహిత్ శర్మ టీ20 వరల్డ్ కప్ ఆడటంపై కూడా రవిశాస్త్రి స్పందించాడు. వరల్డ్ కప్ లో 30 మ్యాచ్ లు ఆడాల్సి ఉంటుంది. కోహ్లీ, రోహిత్, పంత్, బుమ్రా వరల్డ్ కప్ ఆడుతారు.. కానీ, ప్రతి మ్యాచ్ లో ఉండే అవకాశం అయితే కనిపించడం లేదు. అంతేకాకుండా వారికి ఏదైనా గాయం అయితే తప్ప వారిని వరల్డ్ కప్ నుంచి తప్పించే అవకాశం లేదు అంటూ రవిశాస్త్రి అభిప్రాయాపడ్డాడు. రవిశాస్తిర వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Former #TeamIndia Head Coach #RaviShastri Wants #SanjuSamson For #T20WorldCup In #Australia pic.twitter.com/SKY8tqxlbJ
— Fantasy Sports King (@FantasySportsK1) June 8, 2022