ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో కోహ్లీ బ్యాటింగ్ కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. మాజీ కెప్టెన్ గంగూలీకి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా తిరస్కరించడం, నవీన్ ఉల్ హక్ తో గొడవ, గంభీర్ తో వివాదం లాంటివి కోహ్లీకి కాస్త చెడ్డ పేరునే తీసుకొచ్చాయని చెప్పాలి.తప్పు ఎవరిది అనే సంగతి పక్కన పెడితే ఒక సీనియర్ గా హుందాగా నడుచుకోవాల్సిన బాధ్యత కోహ్లీకి ఎంతైనా ఉంది. ఇదే విషయమై మాట్లాడుతూ భారత మాజీ కోచ్ కోహ్లీకి ఒక కీలక సలహా ఇచ్చాడు.
భారత క్రికెట్ లో విరాట్ కోహ్లీ స్థానం ప్రత్యేకం. తనదైన శైలిలో బ్యాటింగ్ లో అదరగొడుతూ ఎన్నో ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు. 15 సంవత్సరాలుగా టీమిండియాకు ఎన్నో మరపురాని విజయాలందించాడు. దీంతో ఈ స్టార్ బ్యాటర్ ఖాతాలో ఎన్నో రికార్డులు, అంతకు మించి రివార్డులు వచ్చి చేరాయి. ఈ విషయంలో కోహ్లీని చూసి దేశం గర్విస్తుంది. బీసీసీఐ నుంచి గౌరవ మర్యాదల విషయంలో కోహ్లీకి ఏ మాత్రం ఢోకా లేదు. ఇక ఫాలోయింగ్ విషయంలో కోహ్లీ ఏంటి అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఇంత ఖ్యాతి సాధించిన కోహ్లీ .. ఒక విషయంలో మాత్రం పదే పదే దొరికిపోతున్నాడు. ఇదే విషయమై మాట్లాడుతూ భారత మాజీ కోచ్ రవి శాస్త్రి కోహ్లీకి ఒక కీలక సలహా ఇచ్చాడు.
విరాట్ కోహ్లీ, రవి శాస్త్రి మధ్య ఉండే సాన్నిహిత్యం ఏంటో ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు. కోహ్లీ కెప్టెన్ గా, రవి శాస్త్రి కోచ్ గా ఉన్న సమయంలో టీమిండియా చారిత్రాత్మక విజయాలను సాధించడంతో పాటు నెంబర్ వన్ స్థానంలో కొనసాగింది. ఇక ఎప్పుడైతే రవిశాస్త్రి కోచ్ పదవి ముగిసిందో.. అప్పటినుంచి కోహ్లీకి పెద్దగా కలిసి రాలేదు. ఫామ్ కోల్పోవడం, కెప్టెన్సీకి రాజీనామా చేయడం, బీసీసీఐ తో విబేధాలు వంటివి చాలా ఫాస్ట్ గా జరిగాయి. అయితే అగ్రెస్సివ్ గా ఉండే కోహ్లీ కాస్త నెమ్మదించాడు అనుకునేలోపు మళ్ళీ ఐపీఎల్ లో పాత కోహ్లీని గుర్తు చేస్తున్నాడు. తప్పు ఎవరిది అనే సంగతి పక్కన పెడితే ఒక సీనియర్ గా హుందాగా నడుచుకోవాల్సిన బాధ్యత కోహ్లీకి ఎంతైనా ఉంది.
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో కోహ్లీ బ్యాటింగ్ కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. మాజీ కెప్టెన్ గంగూలీకి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా తిరస్కరించడం, నవీన్ ఉల్ హక్ తో గొడవ, గంభీర్ తో వివాదం లాంటివి కోహ్లీకి కాస్త చెడ్డ పేరునే తీసుకొచ్చాయని చెప్పాలి. ఇదే విషయమై మాట్లాడుతూ రవి శాస్త్రి కోహ్లీ గురించి మాట్లాడాడు. “గత వారం జరిగిన సంఘటనల తర్వాత కోహ్లీ, ధోనికి కొన్ని విషయాలని చెప్పాలనుకుంటున్నాను. ధోని గురించి ప్రేత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడు పక్కా ప్రొఫెషనల్. స్టార్ ప్లేయర్లు గ్రౌండ్ లో ఉన్నంతవరకు కెమెరాలు వారి చుట్టూనే ఉంటాయి. ఈ విషయం కోహ్లీ గుర్తుంచుకోవాలి. డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లేంతవరకు మన చుట్టూనే కెమెరాలు ఉన్నాయి. కెమెరా ద్వారా మనం అందరి మనసు గెలుచుకోవడంతో ఆదర్శప్రాయంగా నిలవొచ్చు. అలాగే ఒక్క రోజులో విలన్ గా కూడా మారిపోవచ్చు. ఈ విషయం గుర్తించి కోహ్లీ జాగ్రత్త పడితే బెటర్ అని చెప్పుకొచ్చాడు. మరి రవి శాస్త్రి ఇచ్చిన సలహా మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.
Lucknow player was taking to Bengaluru player Kohli, BJP MP Gambhir took him away forcibly.
Unreal hate for Kannadigas ! People of Karnataka will remember this till 10th May. #RCBVSLSG pic.twitter.com/oFbAChQfFq
— Rofl Gandhi 2.0 🏹 (@RoflGandhi_) May 1, 2023