మాజీ కోచ్ రవి శాస్త్రీ, కోహ్లీ మధ్య అనుబంధం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరిద్దరూ కోచ్, కెప్టెన్ గా ఉన్నంత కాలం భారత్ అనేక చారిత్రాత్మక విజయాలను సొంతం చేసుకోవడంతో పాటు టెస్టుల్లో నెంబర్ వన్ గా నిలిచింది. దీంతో విరాట్ మీద ఉన్న అభిమానంతో రవి శాస్త్రీ తన మనసులో మాట చెప్పుకొచ్చాడు. "ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో"లో మాట్లాడుతూ ఏం చెప్పాడంటే ?
కెప్టెన్ గా టీమ్ ఇండియా మాజీ సారధి విరాట్ కోహ్లీ పేరు మరోసారి తెర మీదకు వచ్చింది. వన్డే కెప్టెన్ గా విరాట్ ని తొలగించి రోహిత్ శర్మకి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోహ్లీ టెస్టుల్లో కెప్టెన్సీకి రాజీనామా చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. ఇక అప్పటినుంచి టీమిండియాకు మూడు ఫార్మాట్ లలో రోహిత్ శర్మనే కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో డుప్లెసిస్ పూర్తి ఫిట్ నెస్ సాధించని పక్షంలో తాత్కాలిక కెప్టెన్ గా విరాట్ ఆర్సీబీని నడిపిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు భారత మాజీ కోచ్ రవి శాస్త్రీ WTC ఫైనల్ కి కోహ్లీని కెప్టెన్ గా చేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు.
మాజీ కోచ్ రవి శాస్త్రీ, కోహ్లీ మధ్య అనుబంధం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరిద్దరూ కోచ్, కెప్టెన్ గా ఉన్నంత కాలం భారత్ అనేక చారిత్రాత్మక విజయాలను సొంతం చేసుకోవడంతో పాటు టెస్టుల్లో నెంబర్ వన్ గా నిలిచింది. దీంతో విరాట్ మీద ఉన్న అభిమానంతో రవి శాస్త్రీ తన మనసులో మాట చెప్పుకొచ్చాడు. “ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో”లో మాట్లాడుతూ “డబ్ల్యూటీసి ఫైనల్ కి విరాట్ ని కెప్టెన్ చేయాలి. రోహిత్ భారత జట్టుకు కీలక ఆటగాడు. అతను ఫిట్ గా ఉండాలని కోరుకుంటున్నా. ఒకవేళ రోహిత్ శర్మకు గాయమైతే టీమిండియాను ఎవరు లీడ్ చేస్తారు? ఈ విషయం గురించి కూడా కాస్త ఆలోచించాలి. అప్పుడు కెప్టెన్ గా విరాట్ సరైనోడు”.అని రవి శాస్త్రీ చెప్పుకొచ్చాడు.
ఈ సందర్భంగా ఇంగ్లాండ్ లో జరిగిన టెస్టు గురించి కూడా మాట్లాడాడు. “ఇంగ్లాండ్ లో జరిగిన టెస్టు సిరీస్ లో విరాట్ సారధ్యంలోని భారత జట్టు మొదటి నాలుగు టెస్టుల్లో 2-1 లీడ్ లో ఉంది. ఇక ఆ తర్వాత కొన్ని కారణాల వాళ్ళ జరిగిన ఈ టెస్టులో రోహిత్ కి గాయమవడంతో బుమ్రాకి కెప్టెన్సీ అవకాశం దక్కింది. అయిత్ ఈ మ్యాచులో విరాట్ కోహ్లీ ని చేస్తే బాగుండేది” అని తెలిపాడు. ఐపీఎల్ తర్వాత భారత్ డబ్ల్యూటీసి ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడాల్సి ఉంది. ఇంగ్లాండ్ లోని ఒవెల్లో జరగబోయే ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్ జూన్ 7 న జరగనుంది. ఈ నేపథ్యంలో రవిశాస్త్రీ కోహ్లీని కెప్టెన్ గా సూచించడం మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.