స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ సరికొత్త రికార్డు నమోదు చేశాడు. ప్రపంచంలోనే ఆ ఘనత సాధించిన తొలి బౌలర్ గా రికార్డులకెక్కాడు. ప్రస్తుతం ఈ విషయం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
అఫ్గానిస్థాన్ క్రికెట్ టీమ్ అనగానే అందరికీ ఓ చిన్నచూపు. కానీ ఆ జట్టే ఇప్పుడు అద్భుతాలు చేస్తోంది. మెల్లగా తనపై ఉన్న పసికూన అనే ముద్రని తుడుచుకుంటూ వస్తోంది. ‘బుడ్డోళ్లు బుడ్డోళ్లు అంటే గుడ్డలూడదీసి కొడతాం’ అనేలా క్రికెట్ ఆడుతోంది. తాజాగా పాక్ తో టీ20 సిరీస్ ఆడి, దాన్ని కైవసం చేసుకున్న అఫ్గాన్ జట్టు సరికొత్త రికార్డు సృష్టించింది. అదే టైంలో కెప్టెన్ రషీద్ ఖాన్.. తన బౌలింగ్ తో ఏకంగా వరల్డ్ రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో ఇదే టాపిక్. ఎందుకంటే ఓ సిరీస్ తో ఇలా రెండు ఘనతలు సాధించడంతో క్రికెట్ ప్రేమికులు దీని గురించి మాట్లాడుకుంటున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. షార్జా వేదికగా పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్ జరిగింది. తొలి రెండు మ్యాచుల్లో అఫ్గాన్ జట్టు విజయం సాధించగా, సోమవారం రాత్రి జరిగిన మూడో టీ20లో మాత్రం పాక్ విజయం సాధించింది. 2-1 తేడాతో అఫ్గాన్ జట్టు గెలిచింది. ఈ క్రమంలోనే కెప్టెన్ గా రషీద్ ఖాన్ అరుదైన ఘనత సాధించాడు. ఐసీసీ టాప్-6 టీమ్ పై గెలిచిన తొలి అఫ్గాన్ సారథిగా రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది. అలానే బౌలర్ గానూ మరో సరికొత్త రికార్డు తన పేరిట నమోదు చేసుకున్నాడు.
సాధారణంగా టీ20ల్లో బ్యాటర్లు రెచ్చిపోతుంటారు. బౌలర్లు కేవలం బౌలింగ్ వేయడానికేనా అన్నట్లు చూస్తుంటారు. అలాంటి ఈ ఫార్మాట్ లో తన స్పిన్ తో ముప్పతిప్పలు పెట్టే రషీద్ ఖాన్.. ఒక్క బౌండరీ కూడా ఇవ్వకుండా వరసగా 100కి పైగా బంతులేశాడు. ప్రపంచంలోనేఈ మార్క్ అందుకున్న తొలి బౌలర్ గా నిలిచాడు. యూఏఈ జట్టుతో మూడు టీ20ల్లో వరసగా బౌండరీ ఇవ్వకుండా 2, 24, 24 బంతులేసిన రషీద్.. తాజాగా పాక్ తో టీ20 సిరీస్ లో 24, 24, 8 బంతులేశాడు. మొత్తంగా చూసుకుంటే టీ20ల్లో ఒక్క బౌండరీ ఇవ్వకుండా రషీద్ 106 బంతులేశాడు. అటు సిరీస్ తోపాటు ఇటు అరుదైన రికార్డు సృష్టించాడు. మరి రషీద్ వరల్డ్ రికార్డుపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.
Across six T20Is, Rashid Khan bowled 106 consecutive deliveries without conceding a single boundary 🤯
Outrageous.#AFGvPAK pic.twitter.com/ym7QdVFyU6
— Wisden (@WisdenCricket) March 27, 2023