లేస్తే.. ఇండియాపై పడి ఏడ్చే పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు. ఇప్పుడు ఆఫ్ఘనిస్థాన్ చేతిలో ఘోర పరాజయంపై నోరు విప్పడంలేదు. ఇండియాను వరల్డ్ కప్‌లో ఓడిస్తాం, ఆసియా కప్‌లో ఓడిపోతారనే పాక్‌కు రావడం లేదంటూ.. మాట్లాడిన వారంతా.. ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. ఆఫ్ఘాన్ చేతిలో ఓటమి వారి నోర్లు మూయించిందా?
షార్జాలో పాకిస్థాన్ పరువు మంటగలిసింది. టీ20 క్రికెట్‌లో వీరులం శూరులం అని గొప్పలు చెప్పుకునే పాక్ ఆటగాళ్లు.. ఆఫ్ఘనిస్థాన్ చేతుల్లో చావు దెబ్బ తిన్నారు. మూడు టీ20ల సిరీస్‌లో 1-2 తేడాతో ఓటమి పాలయ్యారు. రషీద్ ఖాన్ కెప్టెన్సీలోని ఆఫ్ఘనిస్థాన్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించి.. పటిష్టమైన పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించి.. తొలి సిరీస్ విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయం ఆఫ్ఘనిస్థాన్ చరిత్రలో గొప్ప మైలురాయి కాగా.. పాకిస్థాన్‌కు మాత్రం గుణపాఠం. ప్రతి విషయంలో భారత్‌తో పోల్చుకునే పాకిస్థాన్.. చివరికి ప్రపంచంలోనే అత్యంత రిచ్ క్యాస్ లీగ్ అయిన ఐపీఎల్‌ను సైతం తక్కువ చేస్తూ అవాకుచవాకులు పేల్చారు.
ఐపీఎల్ కంటే పీఎస్‌ఎల్(పాకిస్థాన్ సూపర్ లీగ్)కు ఎక్కువ ఆదరణ ఉందంటూ.. నిరాధారమైన వ్యాఖ్యలు చేశారు. పైగా.. జీవం లేని ఫ్లాట్ పిచ్‌లను తయారు చేయించుకుని.. 200, 250 స్కోర్లు వచ్చేలా ప్లాన్ చేసి పీఎస్‌ఎల్‌లో పాకిస్థాన్ బ్యాటర్లు చెలరేగుతున్నారంటూ అర్థం లేని ఆర్భాటం చేశారు. అలాగే.. ఆసియా కప్ 2023 విషయంలోనూ పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌లో జరిగే ఆసియా కప్ 2023లో భారత్ రామంటుంది.. భద్రతా కారణాల వల్ల కాదని, పాకిస్థాన్ చేతుల్లో ఓడిపోతామని భయపడుతున్నారంటూ ఒళ్లుమండే కామెంట్లు వినిపించాయి. దీనికి టీమిండియా నుంచి ఒక్కరు కూడా స్పందించలేదు. కానీ.. ఈ ఓవర్ కాన్ఫిడెన్ష వ్యాఖ్యలు, పీఎస్‌ఎల్ మెరుపుల తర్వాత ఆఫ్ఘనిస్థాన్‌తో మూడు టీ20ల సిరీస్ ఆడేందుకు షార్జా వెళ్లిన పాకిస్థాన్ బొక్కబోర్లా పడింది. అతి విశ్వాసంతో ఆఫ్ఘనిస్థాన్‌ను చాలా తక్కువ అంచనా వేసిన పాకిస్థాన్‌కు ఆఫ్ఘాన్ కళ్లు బౌర్లు కమ్మే షాక్ ఇచ్చింది.
ఓవర్ కాన్ఫిడెన్స్‌తో బాబర్ అజమ్, రిజ్వాన్, షాహీన్ షా అఫ్రిదీలకు రెస్ట్ ఇచ్చి.. షాదాబ్ ఖాన్ కెప్టెన్సీలోని పాకిస్థాన్ టీమ్ ఆఫ్గాన్‌తో టీ20 సిరీస్‌కు సిద్ధమైంది. రషీద్ ఖాన్ కెప్టెన్సీలోని ఆఫ్ఘాన్ టీమ్‌ను పాక్ చాలా తక్కువ అంచనా వేసి చావు దెబ్బ తింది. రషీద్ ఖాన్ అండో కో.. పాక్‌కు తొలి రెండు మ్యాచ్‌ల్లో చుక్కలు చూపించారు. మూడు టీ20ల సిరీస్‌ను 2-1తో గెలిచి చరిత్ర సృష్టించారు. ఇలా.. ఐపీఎల్‌ను తక్కువ చేస్తూ.. పసలేని ఫ్లాట్ పిచ్‌ల పీఎస్‌ఎల్‌ను ఆహా, ఓహో అంటూ సొంత డబ్బా కొట్టుకుని, టీమిండియాపై అవకులుచవాకులు పేలిన పాకిస్థాన్‌కు రషీద్ సేన తగిన బుద్ధి చెప్పింది. పాక్ పరువును తీసి, ఇండియా తరఫున పాక్‌కు బుద్ధి చెప్పింది. ఆఫ్ఘనిస్థాన్‌పై గెలవలేని వాళ్లు.. ఆసియా కప్‌లో ఇండియాను ఓడిస్తారా? అంటూ ఇప్పుడు భారత క్రికెట్ అభిమానులు పాక్‌ను ఓ ఆట ఆడుకుంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
🏆💙#AFGvPAK pic.twitter.com/IHyX5ntksD
— Rashid Khan (@rashidkhan_19) March 28, 2023