టీ20 క్రికెట్‌లో ప్రపంచ నెంబర్ వన్ బౌలర్ రషీద్ ఖాన్ మరోసారి తన మ్యాజిక్‌ను చూపించాడు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్‌లో ఆడిలైట్ స్టైకర్స్ తరపున ఆడుతున్న రషీద్ ఖాన్.. బుధవారం బ్రిస్బేన్ హీట్‌తో జరిగిన మ్యాచ్‌లో తన విశ్వరూపం చూపించాడు. ఏకంగా 6 వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు. విశేషం ఏమిటంటే.. తన తొలి ఓవర్‌లో 11 పరుగులు సమర్పించుకున్న రషీద్ తర్వాత ఓవర్ నుంచి చెలరేగాడు.
RASHID KHAN’S GOT 6-17!
He dominates in his 300th and last #BBL11 game!
And the Strikers take the win! Wow! What a finish! pic.twitter.com/qgpeuckY7r
— cricket.com.au (@cricketcomau) January 12, 2022
చివరి మూడు ఓవర్లలో కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఆడిలైట్ స్టైకర్స్ ఏకంగా 71 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. అలాగే బ్యాటింగ్‌లోనూ రషీద్ సత్తా చాటాడు.. రెండు భారీ సిక్సులు బాది అలరించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆడిలైట్ నిర్ణీత 20 ఓవర్లలో 161 పరుగులు చేసింది. చేజింగ్‌కు దిగిన బ్రిస్బేన్ హీట్ రషీద్‌ఖాన్ దెబ్బకు 15 ఓవర్లలో కేవలం 90 పరుగులకే చాపచుట్టేసింది. మరి రషీద్ మ్యాజిగ్ బౌలింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Rashid Khan’s four-over spell v the Heat: 6/17 🔥
Rashid Khan’s last three overs: 6/6 😳#BBL11 pic.twitter.com/WWhCIY3rMS
— 7Cricket (@7Cricket) January 12, 2022
SIX WICKETS FOR RASHID KHAN!#BBL11 pic.twitter.com/YLDVyRYhjL
— 7Cricket (@7Cricket) January 12, 2022