టీమిండియా సీనియర్ స్పిన్నర్ అశ్విన్ కామెంట్‌కు టీ20 నంబర్ వన్ బౌలర్, ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తెలుగులో రిప్లే ఇచ్చి షాక్ ఇచ్చాడు. కాగా టీ20 వరల్డ్ కప్‌లో బుధవారం ఆఫ్గాన్‌తో జరగిన మ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజయం సాధించిన తర్వాత అశ్విన్ మాట్లాడుతూ.. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ మంచి ప్రదర్శన కనబర్చింది. ఇక మా ఆశలన్నీ ఆఫ్గాన్‌పైనే ఉన్నాయి. ఆ జట్టు మిస్టరీ స్పిన్నర్ ముజీబ్ గాయం నుంచి త్వరగా కోలుకునేందుకు అవసరమైతే తమ నుంచి ఫిజియో సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సరదాగా వ్యాఖ్యానించాడు.
ఈ కామెంట్‌ను ఐసీసీ తన అధికారిక ట్వీట్టర్ అకౌంట్‌లో పోస్టు చేసింది. ఈ పోస్టుకు రషీద్ ఖాన్ ‘భాయ్ డోంట్ వరీ.. మా టీమ్ ఫిజియో ప్రశాంత్ పంచాడా ‘చూసుకుంటున్నారు’’ అంటూ తెలుగులో రిప్లే ఇచ్చాడు. దీనికి అశ్విన్ కూడా నవ్వుతున్న ఎమోజీస్‌తో రిప్లే ఇచ్చాడు. మొత్తానికి న్యూజిల్యాండ్ ఆఫ్గనిస్తాన్ జట్టు ఓడించాలని టీమిండియా బలంగా కోరుకుంటుంది. రషీద్ ఖాన్, ముజీబ్ ఇద్దరు బంతితో చెలరేగితే న్యూజిల్యాండ్‌ను ఓడించడం పెద్దకష్టమేమి కాదు. కాగా రషీద్ ఖాన్ ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే.
ఇక ఆ జట్టు ఫిజియో ప్రశాంత్ పంచాడా కూడా మన హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి కావడంతోనే రషీద్ తెలుగులో రిప్లే ఇచ్చినట్లు తెలుస్తుంది. మీ సహాయం మాకు అవసరం లేదు మేము ఉన్నాం చూసుకునేందుకు అన్నట్లు ఆఫ్గాన్ జట్టు ఫిజియో ప్రశాంత్ తన మాటను రషీద్ ఖాన్‌తో అశ్విన్‌కు చెప్పించినట్లు అర్థం అవుతోంది. ఏది ఏమైనప్పటికీ క్రికెటర్ల మధ్య ఇలాంటి స్నేహపూర్వక వాతావరణం ఆటకు మంచి చేస్తుందని నెటిజన్లు అంటున్నారు. మరి రషీద్ ఖాన్ తెలుగు రిప్లేపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
@ashwinravi99 Bhai Don’t worry our team Physio Prasanth Panchada “Chusukuntunnaru” 😂😂🤪
— Rashid Khan (@rashidkhan_19) November 4, 2021