పాకిస్థాన్‌పై ఆఫ్ఘనిస్థాన్ తొలి సారి సిరీస్ విజయం సాధించింది. ఇలాంటి గొప్ప విజయం తర్వాత కూడా ఆఫ్ఘనిస్థాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ చాలా సింపుల్‌గా ధోనిని ఫాలో అయిపోయాడు. విజయం సాధించిన ప్రశంసల కంటే కూడా ఎక్కువ పొగడ్తలు అందుకుంటున్నాడు.
పాకిస్థాన్‌పై మూడు టీ20ల సిరీస్‌ను కైవసం చేసుకొని ఆఫ్ఘనిస్థాన్ చరిత్ర సృష్టించింది. యూఏఈలోని షార్జాలో పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య జరిగిన మూడు టీ20ల్లో తొలి రెండు మ్యాచ్‌ల్లో అద్భుత విజయాలు సాధించిన ఆఫ్ఘనిస్థాన్.. సోమవారం జరిగిన చివరి టీ20లో ఓడినా.. సిరీస్‌ను కైవసం చేసుకుని.. పాక్‌పై తొలి సిరీస్ విజయం నమోదు చేసింది. ఈ గొప్ప ఘనత తర్వాత ఆఫ్ఘాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ చేసిన ఒక పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన క్రికెట్ అభిమానులు భారత దిగ్గజ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనిని రషీద్ ఖాన్ గుర్తు చేశాడంటూ మురిసిపోతున్నారు.
ధోని ఎన్నో గొప్ప గొప్ప విజయాలు సాధించాడు. భారత్‌కు మూడు ఐసీసీ ట్రోఫీలను అందించాడు. 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ.. ఇలా ధోని కెప్టెన్‌గా ఉన్నంత కాలం టీమిండియాకు స్వర్ణయుగంగా గడిచింది. వీటితో పాటు ఎన్నో సిరీస్ విజయాలను కెప్టెన్‌గా ధోని సాధించాడు. అనేక మ్యాచ్‌ల్లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి మరీ.. టీమిండియాను విజయ తీరాలకు చేర్చాడు. కానీ.. ఏనాడు కూడా కప్పు పట్టుకుని టీమ్ మధ్యలో నిలబడింది లేదు. ఎంత గొప్ప విజయమైనా.. కప్పు యువ క్రికెటర్లకు ఇచ్చేసి.. పక్కకు వెళ్లి ఎంతో సాదాసీదాగా, హుందాగా నిలబడేవాడు.
ధోనికి కోట్ల మంది అభిమానులు ఉండేందుకు ఇది కూడా ఒక కారణం. అతని ఆటతో పాటు అతని సింప్లిసిటీని కూడా చాలా మంది ఇష్టపడతారు. విజయం సాధించేందుకు ఎంత కష్టపడాలో అంతకు మించి కష్టపడతాడు.. విజయం తర్వాత ఆనంద క్షణాలను, ఆ విజయం తాలుకు అనుభూతిని మాత్రం యువ క్రికెటర్లకు పంచేందుకు ఎక్కువగా ఇష్టపడతాడు. అందుకే ఏ కప్పు గెలిచినా.. కెప్టెన్‌గా ఆ కప్పును ప్రజెంటర్ల నుంచి తీసుకుని, ఛాంపియన్స్ బోర్డు వద్ద నిలబడిన జట్టు సహచరుల చేతుల్లో పెట్టేసి తాను మాత్రం కామ్‌గా వెళ్లి చివర్లో నిల్చుంటాడు. అది ధోని అంటే. ఇప్పుడు పాకిస్థాన్‌పై తొలి సిరీస్ విజయం సాధించి చరిత్ర సృష్టించిన తర్వాత ఆఫ్ఘనిస్థాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ సైతం అదే పని చేశాడు. ట్రోఫీని అందుకుని యువ క్రికెటర్ల చేతుల్లో పెట్టేసి.. వెళ్లి చివర్లో నిల్చున్నాడు. కెప్టెన్‌గా రషీద్ కూడా ధోని అంత గొప్పవాడు కావాలని, ఈ వీడియో చూసిన తర్వాత క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
The moment we’ve been waiting for! 🤩
Afghanistan lifts the trophy with pride after a remarkable and hard-earned victory over Pakistan. 🌟🏆👏#AfghanAtalan | #AFGvPAK | #LobaBaRangRawri pic.twitter.com/Wug2U0uEIb
— Afghanistan Cricket Board (@ACBofficials) March 27, 2023