రంజీ ట్రోఫీలో భాగంగా ఫైనల్లో సౌరాష్ట్ర-వెస్ట్ బెంగాల్ జట్లు తలపడుతున్నాయి. ఇక ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన బెంగల్ బ్యాట్స్ మెన్ లకు చుక్కలు చూపించారు సౌరాష్ట్ర బౌలర్లు. ముఖ్యంగా యంగ్ పేసర్ చేతన్ సకారియా తన ఇన్ స్వింగ్ లతో ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తించాడు.
తొలి నుంచి ఎంతో ఆసక్తికరంగా సాగుతూ వస్తున్న రంజీ ట్రోఫీ.. చివరి దశకు చేరుకుంది. ఇక రంజీ ట్రోఫీ ఫైనల్లో భాగంగా.. సౌరాష్ట్ర వర్సెస్ వెస్ట్ బెంగాల్ తలపడుతున్నాయి. ఇక ఫైనల్ మ్యాచ్ తొలిరోజే టెస్ట్ ఆసక్తికరంగా మారింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగాల్ జట్టు 174 పరుగులకే ఆలౌట్ అయ్యింది. సౌరాష్ట్ర బౌలర్లు తమ పదునైన ఇన్ స్వింగ్, అవుట్ స్వింగ్ లతో చెలరేగడంతో.. బెంగాల్ జట్టు పేకమేడలా కుప్పకూలింది. మరీ ముఖ్యంగా సౌరాష్ట్ర యంగ్ పేసర్ చేతన్ సకారియా తన స్వింగ్ తో బెంగాల్ బ్యాటర్లకు చుక్కలు చూపాడు. ఈ మ్యాచ్ లో ఓ ఇన్ స్వింగ్ ద్వారా బెంగాల్ బ్యాటర్ ను అవుట్ చేసిన విధానం వరల్డ్ క్లాస్ బౌలర్లనే ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ప్రస్తుతం ఆ ఇన్ స్వింగ్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
రంజీ ట్రోఫీలో భాగంగా ఫైనల్లో సౌరాష్ట్ర-వెస్ట్ బెంగాల్ జట్లు తలపడుతున్నాయి. ఇక ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన బెంగల్ బ్యాట్స్ మెన్ లకు చుక్కలు చూపించారు సౌరాష్ట్ర బౌలర్లు. ముఖ్యంగా యంగ్ పేసర్ చేతన్ సకారియా తన ఇన్ స్వింగ్ లతో ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తించాడు. తన తొలి ఓవర్ లోనే రెండు వికెట్లు తీసి బెంగాల్ పతనాన్ని శాసించాడు. సకారియా తన మెుదటి ఓవర్ రెండో బంతికే బెంగాల్ ఓపెనర్ సుమంత గుప్తాను అవుట్ చేశాడు. ఇక ఇదే ఓవర్ లో వేసిన నాలుగో బంతి మాత్రం నభూతో నభవిష్యతి అని చెప్పాలి.
ఈ బంతికి ప్రత్యర్థి ఆటగాడు సుదీప్ ఘరామి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే ఇది ఆషామాషీ బాల్ కాదు. సకారియా ముందుగా ఓపెనర్ సుమంత గుప్తాను అవుట్ చెయ్యడానికి ఆఫ్ స్టంప్ లైన్ చుట్టూ ఫుల్ లెంగ్త్ డెలివరి వేసి బౌల్డ్ చేశాడు. ఇక సుదీప్ ఘరామికి కూడా సేమ్ వేశాడు. దాంతో బాల్ అవుట్ స్వింగ్ అయ్యి బయటికి వెళ్తుందని అనుకున్నాడు సుదీప్. కానీ బాల్ అనూహ్యంగా ఇన్ స్వింగ్ అయ్యి ఆఫ్ స్టంప్ ను ఎగరేసింది. దాంతో కళ్లు తేలేశాడు బెంగాల్ బ్యాటర్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. బెంగాల్ తొలి ఇన్నింగ్స్ లో 174 పరుగులకే ఆలౌట్ కాగా.. జట్టులో షాబాజ్ అహ్మద్ (69), అభిషేక్ పొరెల్(50) పరుగులతో రాణించారు. సౌరాష్ట్ర బౌలర్లలో కెప్టెన్ ఉనాద్కత్, సకారియాలు చెరి మూడు వికెట్లు నేలకూల్చారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన సౌరాష్ట్ర తొలి రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు నష్టపోయి 81 పరుగులు చేసింది. క్రీజ్ లో హార్విక్ దేశాయ్(38), చేతన్ సకారియా(2) పరుగులతో ఉన్నారు. మరి సకారియా అద్భుతమైన ఇన్ స్వింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
— Rahul Chauhan (@ImRahulCSK11) February 16, 2023