రంజీ ట్రోఫీ.. దేశవాళీ క్రికెట్ లో అత్యుత్తమ టోర్నీ. ఇక్కడ బాగా రాణించారంటే.. వారికి జాతీయ జట్టులోకి అరంగ్రేటం చేసే అవకాశం ఉన్నట్లే. ముంబై యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ దేశవాళీ టోర్నీల్లో పరుగుల సునామీ సృష్టిస్తున్నాడు. ముంబై తరుపున రంజీ ట్రోఫీ ఆడుతున్న సర్ఫరాజ్ ఖాన్, గత 12 ఇన్నింగ్స్‌ల్లో 1471 పరుగులు చేశాడు. టీమిండియాకి ఆడాలంటే ఈ మాత్రం ఉండాలంటూ భారీ ఇన్నింగ్స్ లతో చెలరేగిపోతున్నాడు.
రంజీ ట్రోఫీ 2022 సీజన్‌లో సౌరాష్ట్రతో జరిగిన మొదటి మ్యాచ్‌లో సర్ఫరాజ్.. 401 బంతుల్లో 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 275 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. రంజీ ట్రోఫీలో గత 12 ఇన్నింగ్స్‌ల్లో ఓ త్రిబుల్ సెంచరీ (301 నాటౌట్) , రెండు డబుల్ సెంచరీలు (226 నాటౌట్, 275), 2 సెంచరీలు (177, 165).. ఇలా పరుగుల సునామీ సృష్టిస్తున్నాడు. ప్రస్తుతం ఈ యువ క్రికెటర్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. వరుసగా రెండో రంజీ సీజన్‌లో కూడా పరుగుల వర్షం కురిపిస్తున్నాడు. 2019-20 రంజీ సీజన్‌లో కూడా ఈ బ్యాట్స్‌మెన్ భారీగా పరుగులు చేశాడు.
Alexa, please play 𝙐𝙣𝙨𝙩𝙤𝙥𝙥𝙖𝙗𝙡𝙚 🎶🔥
1️⃣ triple century, 2️⃣ double tons, 2️⃣ daddy 💯s and 3️⃣ more 50+ scores in just the last 1️⃣2️⃣ #RanjiTrophy innings for Sarfaraz Khan 🤯#YehHaiNayiDilli pic.twitter.com/Hvf6kqVN1D
— Delhi Capitals (@DelhiCapitals) March 5, 2022
ఐపీఎల్‌లో పాకెట్ డైనమేట్‌లా ఫ్యాన్స్ దృష్టిని ఆకర్షించాడు సర్ఫరాజ్. గతంలో ఆర్‌సీబీ, పంజాబ్ కింగ్స్ జట్లకి ఆడిన ఈ యువ ఆటగాడిని ఈ ఏడాది జరిగిన మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. ప్రస్తుత ఫామ్ చూస్తుంటే రానున్న ఐపీఎల్ లో చెలరేగడం ఖాయమంటున్నారు మాజీ క్రికెటర్లు.
the Sarfaraz Khan story – from 439 to 301* pic.twitter.com/sOrL3JcA5l
— ESPNcricinfo (@ESPNcricinfo) January 23, 2020
.@klrahul11 quizzes Sarfaraz Khan about his audacious scoop while the youngster remains in awe of Rahul’s stunning grab to dismiss Steve Smith. Interview by @Moulinparikh.
📹 Watch the full interview – https://t.co/m3KZw9jrvt #RRvKXIP #VIVOIPL @lionsdenkxip pic.twitter.com/is4UYMVw6C
— IndianPremierLeague (@IPL) March 26, 2019