ఐపీఎల్‌లో సెంచరీ నమోదు చేసిన తొలి ఇండియన్ బ్యాట్స్‌మెన్, టీమిండియా వెటరన్ క్రికెటర్ మనీశ్ పాండే దేశవాళీ టోర్నీలో విధ్వంసం సృష్టించాడు. రంజీ టోర్నీ 2022లో భాగంగా.. రైల్వేస్ జట్టుతో చెన్నై వేదికగా శుక్రవారం ప్రారంభమైన మ్యాచ్‌లో కర్ణాటక టీమ్ కెప్టెన్ మనీశ్ పాండే(121 బంతుల్లో 12 ఫోర్లు, 10 సిక్సర్లతో 156) భారీ శతకంతో చెలరేగాడు. 12 ఫోర్లు, 10 సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు.
అతనికి తోడుగా క్రిష్ణమూర్తి సిద్ధార్థ్ (221 బంతుల్లో 17 ఫోర్లు, 2 సిక్సర్లతో 121 బ్యాటింగ్) అజేయ శతకంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి కర్ణాటక జట్టు 5 వికెట్ల నష్టానికి 392 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కాగా మనీశ్ పాండే ఇటివల బెంగుళూరు వేదికగా జరిగిన మెగావేలంలో మంచి ధరే పలికాడు. అతన్ని ఐపీఎల్ కొత్త టీమ్‌లలో ఒకటైన లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది. రూ.4.6 కోట్లకు పాండేను లక్నో దక్కించుకుంది. మరి పాండే ఇన్నింగ్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.