క్రికెట్ ఫ్యాన్స్‌కు నాన్‌స్టాప్ వినోదం అందించే ఐపీఎల్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ వేడుకల్లో పాన్ ఇండియా స్టార్లు రామ్ చరణ్-ఎన్టీఆర్ సందడి చేయనున్నారు.
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ సరిగ్గా వారం రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నెల 31న అహ్మాదాబాద్‌లోని నరేంద్రమోదీ క్రికెట్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్-చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య ఆరంభ మ్యాచ్‌తో ఐపీఎల్ 2023కు తెరలేవనుంది. కరోనా కారణంగా గత మూడేళ్లుగా కొన్ని సెలెక్టడ్ వేదికల్లో మాత్రమే ఐపీఎల్ మ్యాచ్‌లను నిర్వహించిన బీసీసీఐ.. ఈ సారి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఫ్రాంచైజ్‌ల హోం గ్రౌండ్స్‌లో మ్యాచ్‌లు నిర్వహించనుంది. దీంతో చాలా కాలం తర్వాత ఐపీఎల్‌కు పూర్తి స్థాయి పూర్వవైభవం రానుంది. అలాగే కరోనా కారణంగా కనుల పండువగా జరిగే ఆరంభ వేడుకలు సైతం మూడేళ్లుగా నిర్వహించడం లేదు.
గతేడాది మాత్రం చివర్లో ముగింపు వేడుకలను నిర్వహించారు. ఆ వేడుకల్లో అతి పెద్ద ఐపీఎల్ జెర్సీని ఆవిష్కరించి రికార్డు సృష్టించారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ డ్యాన్స్‌తో రచ్చ చేశాడు. ఆ వేడుకలు సవ్యంగా సాగడంతో ఈ సారి ఆరంభం వేడుకలను అట్టహాసంగా నిర్వహించి, క్రికెట్ అభిమానులకు కనుల విందును అందించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ఇప్పటికే ఆరంభ వేడుకల్లో డ్యాన్స్ ప్రదర్శనలు ఇవ్వడానికి నేషనల్ క్రష్ రష్మిక మంధాన, తమన్నా భాటియాలతో ఒప్పందం చేసుకున్నారు. ఈ స్టార్ హీరోయిన్ల డ్యాన్స్‌తో ఆరంభం వేడుకలు దద్దరిల్లనున్నాయి. వీరితో పాటు మరో ఇద్దరు బిగ్ స్టార్స్ సైతం ఐపీఎల్ ఆరంభ వేడుకల్లో సందడి చేయనున్నట్లు సమచారం.
ఇటివల ఆస్కార్ అవార్డు అందుకున్న ‘నాటు నాటు’ పాటను ఐపీఎల్ ఆరంభ వేడుకల్లో ప్రత్యేకంగా ప్రదర్శించాలని బీసీసీఐ నిర్ణయించుకుంది. అయితే.. ఈ పాటకు సినిమాలో స్టెప్పులు అదరగొట్టిన గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్-యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లతోనే ఐపీఎల్ ఆరంభ వేడుకల్లో డ్యాన్స్ చేయించాలని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నారట.. అందుకోసం ఇప్పటికే ఈ ఇద్దరు స్టార్లతో సంప్రదింపులు జరిపినట్లు బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. నాటు నాటు పాటకు మరోసారి ఐపీఎల్ లాంటి బిగ్ స్టేజ్‌పై పాన్ ఇండియన్ స్టార్లు రామ్ చరణ్- ఎన్టీఆర్ కలిసి కదం తొక్కనున్నారు. అహ్మాదాబాద్‌లో జరిగే ఆరంభ మ్యాచ్‌కు ముందు జరిగే వేడుకల్లోనే వీరి డ్యాన్స్ ప్రదర్శన ఉండొచ్చు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Si me necesitan, voy a estar 🎶 Naatu, naatu, naatu, naatu, naatu 🎶 pic.twitter.com/7ed6fp39YV
— Netflix Latinoamérica (@NetflixLAT) March 14, 2023