దేశంలోని ప్రతి ఒక్క క్రికెట్ ప్రేమికుడికి మహేంద్ర సింగ్ ధోని గురించి తెలిసే ఉంటుంది. కెప్టెన్ కూల్ గా పేరు గాంచిన ఈ మాజీ సారథి, అసలు కెప్టెన్ కూలే కాదట. పైకి కూల్ గా కనిపించినా.. ఆ ప్రశాంతతను చూసే ఆటగాళ్లు భయపడేవారట. అంతేకాదు.. ధోనీని మొదటిసారి చూసిన సమయంలో ఇతను ఆటగాడేనా అని రైనా అనుకున్నాడట.
ఎంఎస్ ధోనీ.. ప్రపంచ క్రికెట్ లో ఈ పేరొక బ్రాండ్. భారత క్రికెట్ లో తనదైన ముద్ర వేసిన ఈ గొప్ప సారథి క్రికెట్ ప్రయాణం.. ఒక ప్రత్యేక అధ్యాయం. క్రికెట్ ను ఒక మతంగా భావించే మన దేశంలో క్రికెటర్ గా పాపులర్ కావడం సర్వసాధాణం.. కానీ ఆ క్రికెట్ క్రీడకే వన్నెతెచ్చిన క్రీడాకారుడు ఎంఎస్ ధోని. వికెట్ కీపర్ గా, బ్యాటర్ గా, కెప్టెన్ గా.. ధోని సాధించిన రికార్డులను భవిష్యత్తులో ఇంకొకరు తిరగ రాయొచ్చేమో కాని.. తనలాంటి దూకుడైన ‘క్రికెట్ జీనియస్’ను తిరిగి పొందటమన్నది దాదాపు అసాధ్యం.
అలాంటి గొప్పగాడిని మొదటిసారి చూసినప్పుడు ఇతనేం ఆడతాడులే అనుకున్నాడట.. మాజీ క్రికెటర్ సురేశ్ రైనా. కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ ధోనీ చుక్కలు చూపించాడట. ఈ విషయాలన్నీ రైనానే స్వయంగా అభిమానులతో పంచుకున్నాడు. ఐపీఎల్ 2023 సీజన్ నేపథ్యంలో జియో సినిమా కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న సురేశ్ రైనా.. ఒక షోలో ఈ విషయాలను బయటపెట్టాడు. టీమిండియా, సీఎస్‌కే జట్లకు ప్రాతినిధ్యం వహించడానికి ముందు ధోనీ, రైనా ఇద్దరూ క్రికెట్ ప్రత్యర్థులుగా తలపడ్డారు. సెంట్రల్ జోన్ తరుపున.. రైనా, ఈస్ట్ జోన్ తరుపున ధోనీ 2005లో దులీప్ ట్రోఫీ సమయంలోఎదురుపడ్డారు. అప్పుడు జరిగిన ఓ సంఘటనను రైనా గుర్తు చేసుకున్నాడు.
Dhoni honestly looked like Hollywood superstar in long hair style. pic.twitter.com/mFAo8baYtp
— Vinayak 💙 (@NextBiIIionairs) June 19, 2021
“పొడవాటి జుట్టున్న ఓ జార్ఖండ్ ఆటగాడు భారీ సిక్సులు కొడుతున్నాడని అప్పటికే ధోనీ గురుంచి చాలా విషయాలు మేం విన్నాం. అతడు కొడుతుంటే అలవోకగా బంతి మైదానం ధాటిపోతుందంటూ అందరూ గొప్పగా చెప్పేవారు. కానీ మాకు నమ్మేలా అనిపించలేదు. అలాంటి సమయంలో అతనితో ఢీకొట్టే సమయం వచ్చింది. అతనికి సమీపంలోనే మా జట్టు కూర్చొని ఉంది. ఆ సమయంలో ధోనీ ఓ మూలన కూర్చొని ప్రశాంతంగా రోటీ, బటర్ చికెన్ తింటున్నాడు. అతడు పొడవాటి జుట్టు చూసి ఇతనేం ఆడతాడులే అనుకున్నా..”
“మాజీ క్రికెటర్ జ్ఞానేంద్ర పాండే కూడా ధోనీని చూసి.. ‘అతను మనల్ని ఇబ్బంది పెట్టేలా కనిపించట్లేదు. చూడండి.. అతను ఎంత ప్రశాంతంగా ఉన్నాడో.. తిండిని ఎంజాయ్ చేస్తున్నాడో..’ అంటూ వ్యంగ్యంగా మాట్లాడాడు. కానీ తర్వాతి రోజు మ్యాచ్ మొదలవ్వగానే ధోనీ విధ్వంసకర బ్యాటింగ్ ఏంటో మాకు తెలుసొచ్చింది. ఆ మ్యాచులో ధోనీ చెలరేగిపోయాడు. ఆకాశాన్ని ముద్దాడే అంతలా భారీ సిక్స్‌లు బాదాడు. అప్పుడే నేనను, జ్ఞాను భాయ్.. మా మాటల్ని వెనక్కి తీసుకున్నాం..” రైనా చెప్పుకొచ్చాడు. అలాగే, ధోని కెప్టెన్ కూల్ అని అందరికీ తెలిసినా.. మ్యాచ్ పరిస్థితిని బట్టి అతడు తన ఎనర్జీని ప్రదర్శించేవాడని..’ రైనా చెప్పుకొచ్చాడు. కాగా, ధోని పొడవాటి జుట్టును చూసి ముచ్చట పడ్డ వారిలో పాక్ మాజీ ప్రెసిడెంట్ పర్వేజ్ ముషారఫ్ కూడా ఉండడం విశేషం.
Suresh Raina recalls the 2004 Central Zone v East Zone match, when he first saw MS Dhoni launch massive sixes 🚀#MSDhoni #SureshRaina #IndianCricket pic.twitter.com/Z8EF4lEAXT
— Wisden India (@WisdenIndia) March 25, 2023