రాహుల్ త్రిపాఠి.. ఐపీఎల్‌లో ఈ పేరుకు ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అతని బ్యాటింగ్ కు క్రికెటర్లు, మాజీలు సైతం ఫ్యాన్స్ గా ఉన్నారంటేనే అర్థం చేసుకోవచ్చు. 2017లో ఐపీఎల్‌లో ఆడటం ప్రారంభించిన రాహుల్ త్రిపాఠి.. అప్పటి నుంచి మొన్న 2022 ఐపీఎల్ సీజన్ వరకు ఎప్పుడూ అభిమానులను, జట్టును నిరాశ పరచింది లేదు. గత సీజన్లోనూ సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఇరగదీశాడు.
ఆడిన 14 మ్యాచుల్లో 37.55 యావరేజ్‌తో 413 పరుగులు స్కోర్ చేశాడు. అత్యధికంగా 76 పరుగులు చేశాడు. ఆ స్కోర్‌లో 3 అర్ధ శతకాలు ఉండటం విశేషం. అతనిపై మాజీలు సైతం ప్రశంసల వర్షం కురిపించారు. రాహుల్ త్రిపాఠి సైలెంట్‌గా వస్తాడు తన పని పూర్తి చేసుకుని వెళ్లిపోతాడు, రాహుల్ త్రిపాఠి ఎంతో నిలకడ కలిగిన ఆటగాడు అంటూ ఎన్నో పొగడ్తలు, ప్రశంసలు అతనికి దక్కాయి. ఒక్క అవకాశం తప్ప.
One of the worst boards in World Cricket is BCCI. Rahul Tripathi can bat at any positions. Give him a chance. I think he will replace Rohit after his retirement who knows
— sairam (@Maturi20Sairam) August 22, 2022
ఐపీఎల్ తర్వాత ఇంకేముందు రాహుల్ త్రిపాఠి సౌత్‌ఆఫ్రికా టూర్ కు సెలక్ట్ అవుతాడు. అక్కడ చక్కని ఆటతీరుతో ఆకట్టుకుంటాడు. ఆ తర్వాత ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌కు ఎంపికవుతాడు అంటూ ఎన్నో ఊహాగానాలు వచ్చాయి. అతని అభిమానులు సైతం అలాంటి కలలు గన్నారు. కానీ, ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా సిరీస్‌కు రాహుల్ త్రిపాఠిని సెలక్ట్ చేయకపోవడం.. దానిపై మాజీలు సైతం విమర్శలు గుప్పించడం చూశాం.
He deserved a chance 💔#INDvsZIM #Rahultripathi #IndianCricketTeam pic.twitter.com/kbbSbn8L8G
— i.Robiee (@Cricgallery1) August 22, 2022
అయితే ప్రస్తుతం జరుగుతున్న జింబాబ్వే సిరీస్‌లో అలా జరగలేదు. ఈసారి జట్టులో రాహుల్ త్రిపాఠి పేరును ప్రకటించారు. అది చూసి సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులు సైతం సంబరాలు చేసుకున్నారు. రాహుల్ త్రిపాఠి తనదైన స్టైల్‌లో బ్యాటింగ్ ఇరగదీస్తాడు అని. కానీ, ఈసారి కూడా వాళ్లకు నిరాసే మిగిలింది. మూడు వన్డేల్లోనూ రాహుల్ త్రిపాఠి బెంచ్‌కే పరిమితమయ్యాడు.
No Chance for Ruturaj Gaikwad and Rahul Tripathi 😔#ZIMvIND pic.twitter.com/E9U6kiWRcf
— Shivam Jaiswal 🇮🇳 (@7jaiswalshivam) August 22, 2022
మొదటి రెండు వన్డేల్లో చోటు దక్కకపోయినా.. మూడో వన్డేలోనైనా అవకాశం దక్కుతుంది ఆశించిన వారికి ఆశాభంగం కలిగింది. అలాంటి ప్లేయర్‌ను టీమ్‌లోకి తీసుకోరు.. తీసుకున్నా అవకాశం ఇవ్వరంటూ బీసీసీఐ, రాహుల్ ద్రవిడ్‌పై అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. ద్రవిడ్‌కి ఇది అసలు భావ్యమేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. అతనికి ఒక్క అవకాశం ఇవ్వచ్చు కదా అంటూ సోషల్ మీడియాలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ త్రిపాఠికి అవకాశం దక్కకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Again another series where Rahul Tripathi made the squad but didn’t get to play, why you select him if you don’t even play him against Zimbabwe when INDIA have already won the series?
— Prantik (@Pran__07) August 22, 2022
They could have sent #rahultripathi instead of #dhawan, dhawan has been opening for india since the carribbean series. They should have given tripathi a chance. Irony is india have already won the series 🙂 #FuckBcci !!
— аshwiи (@ashwin_ndm) August 22, 2022