టీమిండియా-ఇంగ్లండ్ మధ్య రీషెడ్యూల్ అయిన ఐదో టెస్టు శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. 2021 ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 6 మధ్య కాలంలో ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా నాలుగు టెస్టులు ముగిశాయి. అందులో భారత్ రెండు టెస్టులు గెలిచింది. ఇంగ్లండ్ ఒకటి గెలవగా, తొలి మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో 2-1తో టీమిండియా సిరీస్‌లో ముందంజలో ఉంది. కానీ.. ఆ సమయంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఐదో టెస్టును పోస్టుపోన్ చేశారు.
అదే టెస్టును ఏడాది తర్వాత ఇప్పుడు నిర్వహిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిచినా, డ్రా అయినా సిరీస్ మన సొంతం అవుతుంది. ఇంగ్లండ్ గెలిస్తే సిరీస్ డ్రా అవుతుంది. ఇలా సిరీస్ డిసైడింగ్ టెస్టుగా జరగనున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రదర్శన విషయమై చర్చ జరుగుతోంది. చాలా కాలంగా విరాట్ కోహ్లీ సెంచరీ చేయలేదు. టెస్టుల్లో కోహ్లీ ఇప్పటికే 27 సెంచరీలు ఉన్నాయి. ఓవరాల్‌గా మొత్తం 70 సెంచరీలు చేశాడు.
కానీ.. 71వ సెంచరీ కోసం మాత్రం అతని అభిమానులు మూడేళ్ల నుంచి కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. దీంతో మరోసారి ఇంగ్లండ్‌తో టెస్టు సందర్భంగా కోహ్లీ సెంచరీపై చర్చ మొదలైంది. ప్రస్తుతం అంతగా ఫామ్‌లో లేని కోహ్లీ పరుగులు చేయడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఫామ్‌లేమికి తోడు.. సెంచరీ చేయాలనే ఒత్తిడి కోహ్లీపై ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కోహ్లీ 71వ సెంచరీపై స్పందించారు.
ద్రవిడ్ మాట్లాడుతూ.. ‘సాధారణ అభిమానులు సెంచరీలను సక్సెస్‌కు కోలమానంగా చూస్తారు. టీమిండియా కోచ్‌గా కోహ్లీ లాంటి గొప్ప ఆటగాడి నుంచి నేను ఏం ఆశిస్తానంటే.. జట్టు విజయంలో అతను భాగస్వామి అవ్వాలని కోరుకుంటాను. దాని కోసం అతను సెంచరీనే చేయాల్సిన అవసరం లేదు. జట్టు విజయానికి అవసరమైన 50, 60 పరుగులు చేసినా చాలు. అందుకే కోహ్లీ నుంచి నేను సెంచరీ ఆశించట్లేదు.’ అని చెప్పారు. ఒక కోచ్ రాహుల్ ద్రవిడ్ కోహ్లీపై ఒత్తిడి తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన మాటలను బట్టి అర్థం అవుతుంది. మరి ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఎలాంటి ప్రదర్శన కనబరుస్తాడని మీరు భావిస్తున్నారు? సెంచరీ చేస్తాడా? లేదా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
India coach Rahul Dravid isn’t worried about Virat Kohli’s century drought.
More 👉 https://t.co/MfmgbcdImr pic.twitter.com/qxvoyuCnBO
— ICC (@ICC) June 30, 2022