టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని గురించి ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్, మాజీ దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధోని కారణంగా క్రికెట్‌లో స్పెషలిస్ట్ వికెట్ కీపర్లు లేకుండా పోయారని అన్నారు. ధోని అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన తర్వాత స్పెషలిస్ట్ వికెట్లు కీపర్లు అంటూ లేకుండా పోయారు.. ఇప్పుడంతా.. వికెట్ కీపర్ కమ్ బ్యాటర్లే ఉన్నారు. ధోని తర్వాత కూడా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ కోసం చూస్తున్నాం అని ద్రవిడ్ పేర్కొన్నాడు. 2004 డిసెంబర్ 23న బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ధోని.. అనతి కాలంలోనే స్టార్ క్రికెటర్‌గా ఎదిగాడు. తర్వాత ఏడాది టెస్టుల్లోకి సైతం ఎంట్రీ ఇచ్చి.. జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకున్నాడు. పాకిస్థాన్‌పై ఆడిన 183 పరుగుల ఇన్నింగ్స్‌తో ధోని.. ఇండియన్ టీమ్‌లో ఒక సెన్సేషన్‌గా మారాడు.
సౌతాఫ్రికా వేదికగా జరిగిన మొట్టమొదటి టీ20 వరల్డ్ కప్ 2007కు ముందు సచిన్, గంగూలీ, ద్రవిడ్ లాంటి ఉద్ధండులు పొట్టి ఫార్మాట్‌లో యువ క్రికెటర్లకు అవకాశం ఇచ్చేందుకు పక్కకు తప్పుకోగా.. యువరాజ్ సింగ్, సెహ్వాగ్ లాంటి సీనియర్లను కాదని.. బీసీసీఐ ధోని చేతికి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. బ్యాటింగ్‌లో చాలా అగ్రెసివ్‌గా ఉండే ధోని.. కెప్టెన్‌గా మాత్రం చాలా కూల్‌గా ఎవరి ఊహకు కూడా అందని విధంగా ఎత్తులు వేస్తూ.. తనకు మాత్రమే సాధ్యమైన మాస్టర్ మైండ్ ప్లాన్‌లతో టీమిండియా తొలి టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్‌గా నిలిపాడు. దీంతో.. ధోని పేరు మారుమోగిపోయింది. తొలుత తన ప్రత్యేకమైన హెయిర్‌స్టైల్‌తో ఆ తర్వాత హెలికాప్టర్ షాట్లతో గుర్తింపు పొందిన ధోని.. తర్వాత కెప్టెన్‌గా చరిత్రలో నిలిచిపోయాడు.
సచిన్ టెండూల్కర్ సలహాతో టీమిండియా కెప్టెన్‌గా పూర్తి స్థాయిలో అన్ని ఫార్మాట్ల కెప్టెన్‌గా నియమితమైన తర్వాత.. టీమిండియాను నెక్ట్స్‌లెవెల్‌కు తీసుకెళ్లాడు ధోని. 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ.. తన కెప్టెన్సీలో భారత్‌ను 2011 వన్డే వరల్డ్ కప్‌లో ఛాంపియన్‌గా నిలిపాడు. ఇలా.. ఇండియన్ క్రికెట్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా పేరుతెచ్చుకున్న ధోని.. కెప్టెన్‌గానే కాక.. ఒక వికెట్ కీపర్‌గా టీమిండియాకు ఎనలేని సేవలు అందించాడు. బ్యాటింగ్‌లో అదరగొడుతూనే.. కెప్టెన్‌గా జట్టును నడిపిస్తూ.. వికెట్‌కీపర్‌గా అద్భుతాలు చేశాడు. ధోని ఉన్నంత కాలం టీమిండియాకు మరో వికెట్ కీపర్ అవసరం పడలేదు. దినేష్ కార్తీక్, పార్థీవ్‌పటేల్ వంటి టాలెంటెడ్ క్రికెటర్లు సైతం ధోని హయాంలో మరుగునపడిపోయారు.
ధోని రాకకంటే ముందు వికెట్‌కీపర్ అంటే వికెట్ కీపింగ్ బాగా చేస్తూ.. బ్యాటింగ్ ఏదో నామమాత్రంగా చేసేవారు. లేదా ద్రవిడ్‌లా స్పెషలిస్ట్ బ్యాటర్లు.. ఏదో చేశాంలే అనే విధంగా వికెట్‌కీపింగ్ చేసేవారు. కానీ.. ధోని వచ్చిన తర్వాత.. వికెట్ కీపింగ్ అద్భుతంగా చేస్తూ.. కీపర్‌కు బ్యాటింగ్ స్కిల్స్ కంపల్సరీ చేశాడు. కీపర్ కేవలం కీపింగ్‌మాత్రమే కాకుండా బ్యాటర్ కమ్ వికెట్‌కీపర్‌గా ఉండాలని నిర్దేశించాడు. అప్పటి నుంచి స్పెషలిస్ట్ వికెట్ కీపర్ అనే వ్యవస్థ అంతరించిపోయిందనే చెప్పాలి. ఇదే విషయాన్ని ఒకప్పటి టీమిండియా కెప్టెన్, ఇప్పుడు హెడ్ కోచ్ అయిన ద్రవిడ్ పేర్కొన్నాడు. ద్రవిడ్ తర్వాతనే ధోని టీమిండియాకు పూర్తి స్థాయి కెప్టెన్ అయ్యాడు. కాగా.. ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత.. ధోని స్థానం కోసం కేఎల్ రాహుల్, దినేష్ కార్తీక్, ఇషాన్ కిషన్, సంజు శాంసన్ పోటీ పడుతున్న విషయం తెలిసిందే. వీళ్లందరూ బ్యాటర్ కమ్ వికెట్ కీపర్లే. మరి ధోని సెట్ చేసిన ట్రెండ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Rahul Dravid on MS Dhoni pic.twitter.com/Ba61rtuo9Z
— RVCJ Media (@RVCJ_FB) January 25, 2023