జోహన్నెస్‌బర్గ్ వేదికగా భారత్-సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన రెండో టెస్టులో సౌత్ ఆఫ్రికా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్లు సామర్థ్యం మేర రాణించలేదు. రెండో ఇన్నింగ్స్‌లో పుజారా, రహానే పర్వాలేదని పించిన.. యువ క్రికెటర్ రిషభ్ పంత్ మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. అనవసరమైన షాట్‌కు ప్రయత్నించి వికెట్ పారేసుకున్నాడు. పంత్ అవుట్ అయిన విధనంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. కీలకమైన సమయంలో అనవసరమైన పంతానికిపోయి వికెట్ పారేసుకున్న పంత్ ఆటతీరుపై టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా సీరియస్ అయినట్లు సమాచారం.
ఇదే విషయంపై స్పందించిన ద్రావిడ్.. పంత్‌తో ఈ విషయంపై కచ్చితంగా చర్చిచనున్నట్లు పేర్కొన్నాడు. దీంతో పంత్‌పై ద్రావిడ్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటాడో అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ప్రస్తుతం టీమిండియాలో బ్యాట్స్‌మెన్ కమ్ కీపర్‌కు భారీ పోటీ నెలకొంది. ఇలాంటి పరిస్థితిల్లో కూడా పంత్‌పై టీమిండియా మేనేజ్‌మెంట్ భారీ అవకాశాలు ఇస్తుంది. ద్రావిడ్ కూడా ఇన్ని రోజులగా పంత్ వైపే మొగ్గుచూపుతున్నాడు. సాహా లాంటి సీనియర్ ప్లేయర్ ఉన్నా కూడా పంత్‌కు అవకాశాలు ఇస్తున్నారు. నిజానికి టెస్టు క్రికెట్‌లో ఆడేవారికి చాలా ఓపిక, సహనం ఉండాలి. కానీ పంత్ విషయంలో అవి కనిపించవు. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా ప్లేయర్ రెచ్చగొడితే.. ఆ కోపంతో అనవసరమైన షాట్‌కు ప్రయత్నించి వికెట్ పారేసుకున్నాడు. దీంతో టెస్టు జట్టులో పంత్ కొనసాగింపుపైనే ద్రావిడ్ దృష్టి పెట్టినట్లు సమాచారం. సాహా లేదా తెలుగు తేజం కేఎస్ భరత్‌కు పంత్ ప్లేస్‌లో టెస్టుల్లో అవకాశం కల్పించాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.పంత్ ధోరణి ఇలాగే కొనసాగితే.. సౌత్ ఆఫ్రికాతో సిరీస్ తర్వాత రానున్న శ్రీలంకతో జరిగే సిరీస్‌లో కేఎస్ భరత్ లేదా సాహాకు అవకాశం కల్పించేందుకు ద్రావిడ్ భావిస్తున్నట్లు సమాచారం. పంత్‌ను వన్డే, టీ20లకు పరిమితం చేసి.. సాహాను టెస్టు కీపర్‌గా తీసుకునే ఆలోచన ఉన్నట్లు తెలుస్తుంది. కాగా పంత్‌తో జరిగే చర్చ తర్వాత ద్రావిడ్ ఏ నిర్ణయమైన తీసుకునే అవకాశం ఉంది. మరి పంత్ ఆటతీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: దక్షిణాఫ్రికా డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిన పంత్! కారణం తెలిస్తే షాక్..