అంతర్జాతీయ క్రికెట్ లో ఒక్క మ్యాచ్ ఆడడమే కలగా పెట్టుకునే వారు చాలా మందే ఉన్నారు. కానీ కోహ్లీ మాత్రం చాల సింపుల్ గా 500 మ్యాచులు ఆడేశాడు.ఈ సందర్భంగా ఇండియన్ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ విరాట్ కోహ్లీ గురించి కొన్ని విషయాలను పంచుకున్నాడు.
సాధారణంగా ఒక ఆటగాడు కెరీర్ ప్రారంభంలో పాపులారిటీ సంపాదించుకున్నా.. ఆ తర్వాత క్రమంగా ఆ క్రేజ్ తగ్గడం మనం చూస్తూ ఉంటాం. కానీ టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం అందరికీ భిన్నం. క్రికెట్ లోకి అరంగ్రేటం చేసి 16 ఏళ్ళు గడిచినా విరాట్ కోహ్లీ క్రికెట్ జర్నీ ఇంకా సక్సెస్ ఫుల్ గానే కొనసాగుతుంది. ఇప్పటివరకు ఎన్నో రికార్డులు, రివార్డులను తన ఖాతాలో వేసుకున్న కింగ్.. తాజాగా మరో అరుదైన మైలురాయిని అందుకోకున్నాడు. వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్టులో విరాట్ కోహ్లీ కెరీర్ లో 500 వ మ్యాచ్ కావడం విశేషం. ఈ సందర్భంగా ఇండియన్ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్.. విరాట్ కోహ్లీ గురించి కొన్ని విషయాలను పంచుకున్నాడు. కోహ్లీ పడిన కష్టాలను, అతని త్యాగాలను గుర్తు చేసాడు.
అంతర్జాతీయ క్రికెట్ లో ఒక్క మ్యాచ్ ఆడడమే కలగా పెట్టుకునే వారు చాలా మందే ఉన్నారు. కానీ కోహ్లీ మాత్రం చాల సింపుల్ గా 500 మ్యాచులు ఆడేశాడు. ఇప్పటికీ మంచి ఫామ్, ఫిట్ నెస్ ఉన్న కోహ్లీ మరో మూడు నాలుగేళ్లు ఆడినా ఈజీగా అందరి రికార్డులు బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఇలాంటి ప్రత్యేకమైన మ్యాచ్‌కు ముందు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ మాట్లాడుతూ.. కోహ్లీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ప్రస్తుతం టీమ్‌లో ఉన్న చాలా మంది క్రికెటర్లకు కోహ్లీనే నిజమైన స్ఫూర్తి. అలాగే భారత మహిళా క్రికెటర్లలకు కూడా ఆదర్శంగా నిలిచాడు. కోహ్లీ ఎనర్జీ, నేర్చుకోవాలనే తపన అద్భుతం. శ్రమ, క్షమశిక్షణతోనే కోహ్లీ ఇంత సుదీర్ఘ కాలం పాటు ఆటలో కొనసాగి ఇప్పుడు 500 మ్యాచ్‌ల మార్క్ అందుకుంటున్నాడు. కోహ్లీ నుంచి నేను కూడా చాలా నేర్చుకున్నాను”.అని తెలిపాడు.
ఇక అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక మ్యాచులు ఆడిన వారి లిస్ట్ చూసుకుంటే 664 మ్యాచులతో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ మొదటి స్థానంలో ఉన్నాడు. శ్రీలంక ప్లేయర్లు మహేళ జయవర్ధనే(652), సంగక్కర (594) తర్వాత స్థానాల్లో నిలిచారు. టీమిండియాలోనైతే సచిన్ తో పాటు ధోనీ (538), ద్రవిడ్ (509) ఈ లిస్టులో ఉన్నారు. తాజాగా కోహ్లీ 500 మ్యాచులు పూర్తి చేసుకున్న అరుదైన ఈ లిస్టులో టాప్ 10 లో కోహ్లీ చేరనున్నాడు. ఇప్పటివరకు 110 టెస్టులు, 274 వన్డేలు ఆడిన కోహ్లీ 115 టీ 20 మ్యాచులు ఆడాడు. ప్రస్తుతం వెస్టిండీస్ తో జరిగిన తొలి టెస్టులో కోహ్లీ 76 పరుగులు చేసి మంచి టచ్ లో కనిపించాడు. మరి 500 మ్యాచులో ఒక స్పెషల్ ఇన్నింగ్స్ ఆడతాడేమో చూడాలి. మరి కోహ్లీ గురించి ద్రావిడ్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
500 & Counting 😃
Hear from #TeamIndia Head Coach Rahul Dravid and milestone man Virat Kohli ahead of a special occasion 👌🏻👌🏻#WIvIND | @imVkohli pic.twitter.com/cJBA7CVcOj
— BCCI (@BCCI) July 20, 2023