ఇండియన్ క్రికెట్ టీమ్ గురించి, టీమ్ లో స్టార్ ప్లేయర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ తరంలో ప్రపంచ మేటి దిగ్గజాలు అనతగ్గ ఆటగాళ్లు అంతా టీమ్ లో ఉన్నారు. బ్యాటింగ్ లో రోహిత్, కోహ్లీ, ధావన్, రాహుల్ వంటి స్టార్స్ ఉన్నారు. ఆల్ రౌండర్స్ గా జడేజా, హార్దిక్ వంటి విధ్వంసకారులు ఉన్నారు. ఇక బౌలింగ్ లో బుమ్రా, షమీ, భువి, అశ్విన్ వంటి మేటి బౌలర్లు ఉన్నారు. ఇంత మంది ఆటగాళ్లు ఉన్నా, టీమిండియా మాత్రం ఒక్క ఐసీసీ ట్రోఫీని కూడా ముద్దాడలేకపోతోంది. వరల్డ్ కప్ లాంటి పెద్ద ఈవెంట్స్ లో అనూహ్యంగా ఓటమి చెందుతూ అభిమానులను నిరాశకి లోను చేస్తోంది. అయితే.., ఈ ఓటములకి కారణం టీమిండియా నాలుగవ స్థానమే అని టీమిండియా కొత్త కోచ్ రాహుల్ ద్రావిడ్ భావిస్తున్నాడట.
ఒకప్పుడు టీమిండియాకి నాలుగవ స్థానంలో యువరాజ్ సింగ్ బ్యాటింగ్ కి వచ్చే వాడు. టాప్ ఆర్డర్ త్వరగా ఔట్ అయితే.., యువీ నిదానంగా ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యత తీసుకునేవాడు. ఒకవేళ టాప్ ఆర్డర్ సక్సెస్ అయితే.. యువీ విధ్వంసం సృష్టించి స్లాగ్ ఓవర్స్ లో స్కోర్ బోర్డుని పరుగులు పెట్టించేవాడు. కానీ.., యువరాజ్ రిటైర్మెంట్ తరువాత ఆ స్థానం అలాగే ఖాళీగా ఉండిపోయింది. రాహుల్, విజయ్ శంకర్, దినేశ్ కార్తీక్, జాదవ్, అయ్యర్.. ఇలా చాలా మంది ఆటగాళ్లు ఆ స్థానంలో మారుతూ వచ్చారు. కానీ.., ఏ ఒక్కరు కూడా యువరాజ్ స్థాయిని అందుకోలేకపోయారు. కానీ.., ఒక్క రాయుడు మాత్రమే కొన్ని రోజుల పాటు ఆ స్థానాన్ని అద్భుతంగా భర్తీ చేశాడు. కానీ.., వరల్డ్ కప్ కోసం త్రీ డైమెన్షనల్ ప్లేయర్ ని సెలెక్ట్ చేసి, రాయుడుపై వేటు వేయడంతో టీమిండియా మిడిల్ ఆర్డర్ కష్టాలు తీరలేదు. ఇప్పుడు ఈ విషయం మీదే రాహుల్ ద్రావిడ్ ఫోకస్ పెట్టినట్టు సమాచారం.
రాహుల్ ద్రావిడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టకముందే.. టీమ్ లో దీర్ఘ కాలికంగా ఉన్న కొన్ని సమస్యలపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే మరోసారి రాయుడి పేరు తెరపైకి వచ్చింది. అంబటి రాయుడు వయసు ప్రస్తుతం 36 సంవత్సరాలు. ఇంకో రెండేళ్లలో ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ఉంది. ఎలాగో రాయుడు ఇంకా ఫిట్ గా ఉన్నాడు. లాస్ట్ ఐపీఎల్ లో కూడా రాయుడు బాగానే రాణించాడు. కాబట్టి.., రాయుడిని నాలుగోవ స్థానంలో పర్మినెంట్ గా ఆడించాలి అన్నది ద్రావిడ్ ఆలోచనగా తెలుస్తోంది. రాయుడు ఫేస్, స్పిన్ అన్నీ సమర్ధవంతంగా ఎదుర్కోగలడు. పైగా.., ప్రెజర్ ని హ్యాండిల్ చేయగల అనుభవం ఉంది. పైగా.., రాయుడు ఇన్నింగ్స్ నిర్మించగలడు. అటాకింగ్ గేమ్ ఆడగలడు. కాబట్టి.. రాయుడుకి ద్రావిడ్ మళ్ళీ పిలుపు ఇవ్వబోతున్నాడన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది. మరి.. అంతా సవ్యంగా జరిగితే అంబటి రాయుడు మళ్ళీ ఇండియా టీమ్ లో స్థానం దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. మరి.. అంబటి రాయుడు మళ్ళీ టీమ్ లోకి రావాలని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.