Australia Open 2022: ఆస్ట్రేలియన్ ఓపెన్ 2022 టోర్నీ పెను సంచలనాలతో ముగిసింది. పురుషులు సింగిల్స్ లో 35 ఏళ్ల సీనియర్ ఆటగాడు రఫెల్ నాదల్.. ప్రపంచ రెండో ర్యాంకర్ మెద్వెదెవ్‌పై విజయం సాధించడం ద్వారా 21వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు మహిళల సింగిల్స్ టైటిల్ ను ఆస్ట్రేలియన్ క్రీడాకారిణి ఆష్లే బార్టీ.. డేనియల్ కాలిన్స్ (అమెరికా) పై విజయం సాధించి టైటిల్ ని సొంతం చేసుకుంది.
ఓపెన్ టెన్నిస్ ఎరాలో స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ చరిత్ర సృష్టించాడు. అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు నెగ్గిన ఆటగాడిగా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఆదివారం జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ 2022 పురుషుల సింగల్స్ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ మెద్వెదెవ్ (రష్యా)పై 2-6, 6-7(5-7),6-4, 6-4, 7-5 తేడాతో సంచలన విజయాన్ని నమోదు చేసి 21వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
నువ్వా నేనా అన్నట్లు ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో ఆరో సీడ్ నాదల్ 2-6, 6–7, 6-4, 6-1, 7-5తో, రెండో సీడ్ మెద్వెదేవ్ (రష్యా)పై విజయం సాధించాడు. తొలి రెండు సెట్లు కోల్పోయాక.. రఫా పోరాడిన పటిమ.. పుంజుకున్న తీరు అద్భుతం. ఆరంభంలో దూకుడైన ఆటతో ఆధిపత్యాన్ని ప్రదర్శించిన మెద్వెదేవ్ ఆ తర్వాత నెమ్మదించాడు. చురుకుగా కదలేకపోయాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ చరిత్రలో ఇది (5 గంటల 24 నిమిషాలు) రెండో సుదీర్ఘ ఫైనల్. 2012లో జకోవిచ్, నాదల్ మధ్య మ్యాచ్ 5 గంటల 53 నిమిషాల పాటు సాగింది. 35 ఏళ్ల నాదల్ కు ఇది రెండో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్, 2009లో ఇక్కడ అతడు తొలి టైటిల్ గెలుచుకున్నాడు. ఈ క్రమంలో 20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్న సహచర ఆటగాళ్లు ఫెదరర్, జకోవిచ్‌లను అధిగమించాడు.
2022 ఆస్ట్రేలియన్ ఓపెన్ విన్నర్స్ లిస్ట్ :
పురుషుల సింగిల్స్ : రఫెల్ నాదల్ (స్పెయిన్)
మహిళల సింగిల్స్ : ఆష్లే బార్టీ (ఆస్ట్రేలియా)
పురుషుల డబుల్స్ : కొక్కినాకిస్ (ఆస్ట్రేలియా) / నిక్ కిర్గియోస్ (ఆస్ట్రేలియా)
మహిళల డబుల్స్ : బార్బోరా క్రెజికోవా (చెక్ రిపబ్లిక్) / కాటెరినా సినియాకోవా (చెక్ రిపబ్లిక్)
మిక్స్‌డ్ డబుల్స్ : క్రిస్టినా మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్) / ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా)
Rafael Nadal
1st Major : French Open 2005
5th Major : Wimbledon 2008
10th Major : French Open 2011
15th Major : French Open 2017
20th Major : French Open 2020
21st Major : Australian Open 2022#Nadal#AustralianOpen #AusOpen pic.twitter.com/18N6sXFE4f— Arnav Singh (@Arnavv43) January 30, 2022
How it started. How it is going
Ashley Barty 2022 Women’s single Champion#AusOpen pic.twitter.com/a3T4QdpodU
— Atinuke Esan (@SucreMamito124) January 29, 2022