ఇప్పటికే ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్ వన్డేలకు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా ఆసీస్ విమెన్ క్రికెటర్ రాచెల్ హేన్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. 35 ఏళ్ల హేన్స్ 2009లో ఆస్ట్రేలియా జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టారు. ఆసీస్ తరఫున 6 టెస్టు, 77 వన్డేలు, 84 టీ20లు ఆడి స్టార్ బ్యాటర్‌గా రాణించారు. ఆస్ట్రేలియా తరఫున అత్యధిక పరుగులు చేసిన తొమ్మిదో బ్యాటర్‌గా హేన్స్ నిలిచారు. ఆస్ట్రేలియా సాధించిన 4 టీ20 వరల్డ్ కప్‌లు, రెండు వన్డే వరల్డ్ కప్ జట్లలో హేన్స్ సభ్యురాలిగా ఉన్నారు. అలాగే.. ఇటివల జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో ఆసీస్ గోల్డ్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే. ఈ టీమ్‌లో కూడా హేన్స్ భాగస్వామిగా ఉన్నారు.
ఈ సందర్భంగా రాచెల్ హేన్స్ మాట్లాడుతూ.. తన కెరీర్ ఇంత గొప్ప సాగేందుకు సాయపడ్డ ప్రతి ఒక్కరిక ధన్యవాదాలు తెలిపారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కోచ్‌లు, సహచర ఆటగాళ్లకు కృతజ్ఞతలు తెలిపారు. దేశానికి ప్రతినిథ్యం వహించడం తనకెంతో గర్వంగా ఉందని హేన్స్ వెల్లడించారు. తన కెరీర్‌లో హేన్స్ 6 టెస్టుల్లో 383 పరుగులు చేశారు. అందులో 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే 77 వన్డేలు ఆడి 2585 పరుగుల సాధించారు. అందులో 2 సెంచరీలు, 19 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే వన్డేల్లో ఆమె అత్యధిక వ్యక్తిగత స్కోర్ 130. ఒక 84 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన హేన్స్ 850 పరుగులు సాధించారు. అందులో 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే టెస్టుల్లో రెండు వికెట్లు, వన్డేల్లో 7, టీ20ల్లో 4 వికెట్లు కూడా పడగొట్టారు. మరి హేన్స్ కెరీర్‌పై, ఆమె రిటైర్మెంట్ ప్రకటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ఆస్ట్రేలియా కొత్త కెప్టెన్ గా డేవిడ్ వార్నర్? జీవితకాల నిషేధంపై CA కీలక నిర్ణయం!
Rachael Haynes retires having won it all 🙌 pic.twitter.com/e9UPz1oA0d
— ESPNcricinfo (@ESPNcricinfo) September 15, 2022
Rachael Haynes, what a player! ⭐
Australia’s vice-captain is retiring after 167 matches in the green and gold and 3818 international runs to her name. pic.twitter.com/4tt8Dg3RPx
— cricket.com.au (@cricketcomau) September 15, 2022