అమెరికాలో జరుగుతున్న జాతి వివక్షకు వ్యతిరేకంగా బ్లాక్ లైవ్ మ్యాటర్ కి మద్దతుగా టీ20 ప్రపంచకప్ మ్యాచ్ లలో ఆటగాళ్ళు సంతాపం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఆటగాళ్లంత మద్దతు తెలుపుతుంటే దక్షిణాఫ్రికా ఆటగాడు డికాక్ కి ఇష్టం లేని కారణంగానే మంగళవారం జరిగిన మ్యాచ్ కి దూరంగా ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. ఇక ఇదే ఈ అంశంపై దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు సైతం స్పందించింది.
డికాక్ తన వ్యక్తిగత కారణాల వల్లే ఈ మ్యాచ్ కి దూరంగా ఉండొచ్చిన ట్విట్టర్ లో పేర్కొంది. అయితే ఈ అంశంలో తనపై వస్తున్న వార్తలపై డికాక్ తాజాగా స్పందించాడు. అభిమానులంతా నన్ను క్షమించాలి. ఇలాంటి సమస్య వస్తుందని నేను అనుకోలేదు. ఇలా జాత్యహంకార సమస్య పట్ల ఉన్న ప్రాముఖ్యతని నేను అర్థం చేసుకోగలను అని అన్నారు. నేను రేసిస్ట్ కాదని, బలవంతంగా మోకాళ్ల మీద కూర్చోమనటం నాకు నచ్చలేదని అన్నాడు. జాత్యహంకారానికి వ్యతిరేకంగా ఇలా చేస్తే పరిస్థితులు మారుతాయంటే తప్పకుండా చేస్తానని డికాక్ తెలిపాడు.