వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ మ్యాచులకు ఊహించని షాక్ తగిలింది. వన్డే వరల్డ్ కప్ కు ముందు జింబాబ్వే లోని హరారే, బులవాయోలో ఐసీసీ క్వాలిఫయర్ మ్యాచ్ లను నిర్వహిస్తుంది. ఇదిలా ఉండగా .. క్వాలిఫయర్ మ్యాచులు నిర్వహిస్తున్న హరారే లోని హరారే స్పోర్ట్స్ క్లబ్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఇక పూర్తి వివరాల్లోకెళ్తే..
భారత్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్ లో వన్డే వరల్డ్ కప్ జరుగుతున్న సంగతి తెలిసిందే. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, పాకిస్థాన్, న్యూజీలాండ్, బంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్తాన్, సౌత్ ఆఫ్రికా ఈ ప్రపంచ కప్ కి నేరుగా అర్హత సాధించగా.. మిగిలిన జట్లు క్వాలిఫయర్ మ్యాచులు ఆడుతున్నాయి. ఈ నెల 18 న ఈ క్వాలిఫయింగ్ మ్యాచులు స్టార్ట్ అవ్వగా.. ఇప్పటివరకు 8 లీగ్ మ్యాచులు ముగిసాయి. నేపాల్, జింబాబ్వే, వెస్టిండీస్, యూఎస్ఎ, శ్రీలంక, యూఏఈ, ఐర్లాండ్, ఓమన్, నెదర్లాండ్స్, స్కాట్లండ్ లు రెండు గ్రూపులుగా విడిపోయి మ్యాచ్ లు ఆడుతున్నాయి. జూన్ 27 వరకూ లీగ్ దశ మ్యాచ్ లు ముగుస్తాయి. ఇదిలా ఉండగా .. క్వాలిఫయర్ మ్యాచులు నిర్వహిస్తున్న హరారే లోని హరారే స్పోర్ట్స్ క్లబ్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఇక పూర్తి వివరాల్లోకెళ్తే..
వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ మ్యాచులకు ఊహించని షాక్ తగిలింది. వన్డే వరల్డ్ కప్ కు ముందు జింబాబ్వే లోని హరారే, బులవాయోలో ఐసీసీ క్వాలిఫయర్ మ్యాచ్ లను నిర్వహిస్తుంది. ఇటీవలే ఈ మ్యాచ్ లు ప్రారంభమయ్యాయి. ఇటీవలే ఇదే వేదికలో జింబాబ్వే – నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో జింబాబ్వే 316 పరుగుల లక్ష్యాన్ని కేవలం 40.5 ఓవర్లలోనే ఛేజ్ చేసి సంచలనం సృష్టించింది. అయితే ఈ మ్యాచ్ అనంతరం మైదానంలో సౌత్ వెస్ట్ గ్రాండ్ స్టాండ్‌లో మంటలు వ్యాపించాయి. కాజిల్ కార్నర్ లో అంటుకున్న మంటలు క్రమంగా పైకి ఎగియడంతో పైకప్పు భాగంలో ఉన్న చెట్లకు మంటలు అంటుకున్నాయి. మంటలను గమనించిన అక్కడి సిబ్బంది వెంటనే అగ్నిమాపక శాఖ సాయంతో వాటిని ఆర్పారు. వరల్డ్ కప్ క్వాలిఫై మ్యాచ్ లు ఇదే వేదికలో జరుగుతుండటంతో ఐసీసీ సెక్యూరిటీస్ టీమ్, జింబాబ్వే క్రికెట్ టీమ్ లు స్టేడియంలో తనిఖీలు నిర్వహించాయి.
ఇక ఇలాంటి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో ఇప్పుడు క్వాలిఫయింగ్ మ్యాచులు జరుగుతాయా అనే అనుమానం అందరిలో నెలకొంది. అయితే ఏ విషయంపై ఐసీసీ తాజాగా క్లారిటీ ఇచ్చేసింది. హరారే స్పోర్ట్స్ క్లబ్ లోని సౌత్ వెస్ట్ గ్రాండ్ స్టాండ్ లో ఫైర్ తలెత్తడంతో ప్రమాద ప్రభావం దాని పరిధిలోనే ఉండటంతో మ్యాచ్ లు యాథావిధిగా జరుగుతాయని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇక ప్రస్తుతం గ్రూప్ ఏ లో జింబాబ్వే, గ్రూప్ బి ఒమన్ ఆడిన రెండు మ్యాచుల్లో గెలిచి టేబుల్ టాప్ గా కొనసాగుతున్నాయి. మరి వరల్డ్ కప్ కి ఏ జట్లు అర్హత సాధిస్తాయో చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.
Developing Sad Story !!
It appears a fire 🔥 has broken out at some section of Harare Sports Club or nearer to !!
I hope the fire will be contained before any significant damage as we are in the midst of World Cup Qualifiers!! 🙂🙂 pic.twitter.com/VuZIQKFsNA
— Don Conrado Sol 🇿🇼👉🇿🇦👴 (@haploz99) June 20, 2023