PV Sindhu: ప్రముఖ బాడ్మింటన్ క్రీడా కారిణి పీవీ సింధు పేరు తెలియని వారుండరు. ఆమె దేశ ప్రతిష్టను ఇనుమడింప చేసిన తెలుగు అమ్మాయి. ఇక, సింధు కోర్టులోనే కాదు బయట కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా, అలీతో సరదాగా షోలో ఆమె పాల్గొన్నారు. ఇందుకు సంబంధించి ప్రోమో విడుదలైంది. ఈ షోలో పాల్గొన్న సింధు తెగ నవ్వులు పూయించారు. హోస్ట్ అలీతో కలిసి సరదా పంచులతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రేమ, పెళ్లి గురించి ఓపెన్ అయ్యారు. తాను అందుకున్న లవ్ లెటర్స్ గురించి చెప్పారు. పెళ్లి గురించి కూడా మాట్లాడారు. ‘‘ ఇప్పటి దాకా ఎన్ని లవ్ లెటర్స్ అందుకున్నావ్’’ అని అలీ అడగ్గా. సింధు మాట్లడుతూ.. ‘‘ లెటర్స్ వచ్చాయి.. యా!! ఇంటికి వచ్చాయి’’ అన్నారు.
అలీ వెంటనే ‘‘నాన్న గారు చదివే వాళ్లా?’’ అని అన్నాడు. అప్పుడు సింధు వెంటనే ‘‘ అందరం కలిసి చదివే వాళ్లం’’ అని అన్నారు. ఆ తర్వాత ‘‘ కపుల్ ఇయర్స్ బ్యాక్.. 70 ఏళ్ల ఓ వృద్ధుడు నేను సింధును చేసుకోకపోతే నేను సింధును కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయి పెళ్లి చేసుకుంటా అన్నాడు. అప్పుడు తెలిసొచ్చింది’’ అని అంది. ఆ తర్వాత అలీ ‘‘ పెళ్లి ఎప్పుడు ’’ అని అడగ్గా. ‘‘నాకు నచ్చాలి.. అట్లా…’’ అని అంటూ నవ్వేశారు. మరి, పీవీ సింధును కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకుంటా అన్న వృద్ధుడిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Karthik: భార్య సొంత చెల్లిని పెళ్ళాడి..! వ్యసనాలకు బానిసై! హీరో కార్తీక్ లైఫ్ స్టోరీ!