టోక్యో ఒలంపిక్స్‌లో భాగంగా బరిలోకి దిగింది భారత స్టార్ షట్లర్ పీవీ సింధు. నేడు జరిగిన సెమీస్‌లో భాగంగా ఒటమిని చవి చూసింది సింధు. ప్రపంచ నంబర్ వన్ షట్లర్ తైపీ క్రీడాకారిణి అయిన తై యి జుంగ్ చేతిలో ఓటమిని చవి చూసింది. దీంతో 18-21-12-21 స్కోర్ తేడాతో సింధు ఓడిపోయింది. మొదట్లో షట్లర్ తై యి జుంగ్ కు గట్టి పోటీనిచ్చి తన సత్తాను చూపించింది. దీంతో సింధు గెలుస్తుందని అందరూ అనుకున్నారు. రెండు రౌండ్‌లోను తై యి జుంగ్‌కు గట్టి పోటీనిస్తూ గెలిచినంత పని చేసినా..చివరికి సింధు ఒడిపోక తప్పలేదు.
గత కొన్ని రోజుల నుంచి తన ఆటతో దుమ్ములేపుతున్న సింధు నేడు సెమీస్‌లో మాత్రం కాస్త వెనకడుగేసి పరాజయం పాలైంది. ఇక దీంతో పాటు ఆదివారం చైనా షట్లర్ హి పింగ్ జియావోతో సింధు తలపడనుంది. దీంతోనైన సింధు కాంస్యం పతకం తీసుకొస్తుందేమో చూడాలి మరి. ఇక భారత్ అథ్లెటిక్స్‌లు ఒక్కొక్కరుగా ఇంటికి చేరుకుంటున్నారు. ఒక పక్క కరోనా కేసులు కూడా భారీగా పెరుగుతుండటంతో కఠినమైన జాగ్రత్తల నడుమ పోటీలు నిర్వహిస్తోంది అక్కడి ప్రభుత్వం.