ఐపీఎల్ 2022 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ దాదాపు కొత్త జట్టుతో బరిలోకి దిగనుంది. 2021 తర్వాత కేవలం ఇద్దరు ఆటగాళ్లను మాత్రమే రిటేన్ చేసుకున్న పంజాబ్. ఐపీఎల్ వేలంలో మంచి జట్టునే నిర్మించుకుంది. 2021లో మయాంక్ అగర్వాల్, రవి బిష్ణోయ్‌లను రిటైన్ చేసుకుంది. గతంలో ఆ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న కేఎల్ రాహుల్ పంజాబ్‌ను వీడాడు. రాహుల్‌ను రిటేన్ చేసుకుందాం అని పంజాబ్ యాజమాన్యం భావించినా.. రాహుల్ జట్టును వీడేందుకే ఇష్టపడ్డాడు. దీంతో పంజాబ్‌కు కెప్టెన్ అవసరం ఏర్పడింది.
వేలంలో టీమిండియా స్టార్ ప్లేయర్ శిఖర్ ధావన్‌కు మంచి ధర ఇచ్చి సొంతం చేసుకోవడంతో పంజాబ్ పగ్గాలు అతనికే ఇస్తారని అంతా భావించారు. కానీ పంజాబ్ తమ కెప్టెన్‌గా మయాంక్ అగర్వాల్‌ను ప్రకటించింది. గతంలో రాహుల్ స్థానంలో మయాంక్ జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. కాగా పంజాబ్ ఇంతవరకు ఒక్క సారి కూడా ఐపీఎల్ టోఫీని ముద్దాడలేదు. కనీసం 2022లోనైనా ఐపీఎల్ టైటిల్‌ను గెలవాలని పంజాబ్ ఫ్రాంచైజ్ దృఢ సంకల్పంతో ఉంది. మరి పంజాబ్ కెప్టెన్‌గా మయాంక్‌ను నియమించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
🚨 Attention #SherSquad 🚨
Our 🆕© ➜ Mayank Agarwal
Send in your wishes for the new #CaptainPunjab 🎉#SaddaPunjab #PunjabKings #TATAIPL2022 @mayankcricket pic.twitter.com/hkxwzRyOVA
— Punjab Kings (@PunjabKingsIPL) February 28, 2022