బెంగుళూరు వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మెగా వేలంలో ఆటగాళ్లపై కాసుల వర్షం కురుస్తుంది. ఈ క్రమంలో ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ లివింగ్‌స్టన్‌పై కోట్ల వర్షం కురిసింది. పంజాబ్ కింగ్స్ ఏకంగా రూ.11.50 కోట్లు పెట్టి లైమ్ లివింగ్‌స్టన్‌ను సొంతం చేసుకుంది.
లివింగ్‌స్టన్ కోసం రెండు మూడు ఫ్రాంచైజ్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కోల్‌కత్తా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ లివింగ్‌స్టన్ కోసం పోటీ పడ్డాయి. కానీ చివరికి పంజాబ్ కింగ్స్ అతన్ని సొంతం చేసుకుంది. మరి లివింగ్‌స్టన్ ఇంత భారీ ధర పలకడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.