ఎప్పుడూ బ్యాటుతో కనిపించే గిల్, పుజారా.. అహ్మదాబాద్ టెస్టులో బౌలింగ్ చేశారు. ఇది కాస్త చూసేవాళ్లకు యమ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఇంతకీ వీళ్లిద్దరూ బౌలింగ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది?
అహ్మదాబాద్ లో జరిగిన నాలుగో టెస్టు డ్రాగా ముగిసింది. భారత్-ఆస్ట్రేలియా జట్లు తలపడిన ఈ మ్యాచ్ ఫలితం తేలకుండానే ఐదోరోజుల ఆట పూర్తయిపోయింది. అయితే తొలి రెండు టెస్టులు కూడా మూడు రోజుల్లో ముగియగా.. ఆ రెండింటిలోనూ టీమిండియా విజయం సాధించింది. మూడో టెస్టులో మాత్రం ఆస్ట్రేలియా గెలిచింది. దీంతో నాలుగో టెస్టు కీలకంగా మారింది. దానికి తోడు వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ ఆడాలంటే.. ఇందులో రోహిత్ సేన కచ్చితంగా గెలిచి తీరాలి. ఈ క్రమంలోనే నాలుగో టెస్టులో పలు వెరైటీ సంఘటనలు కూడా చోటుచేసుకోవడం విశేషం. ఇంతకీ అవేంటో చూసేద్దామా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్టులు జరిగాయి. తొలి రెండు టెస్టులు మూడు రోజుల్లోనే ముగిసిపోయేసరికి పిచ్ ల గురించి అందరూ తెగ మాట్లాడుకున్నారు. కానీ వాటిలో టీమిండియా అద్భుతమైన ఆటతీరు వల్ల అలా జరిగి ఉండొచ్చని మాత్రం అనుకోలేకపోయారు. అయితే మూడో టెస్టులో మాత్రం తక్కువ పరుగులే నమోదైనప్పటికీ ఆస్ట్రేలియా విజయం సాధించింది. అహ్మదాబాద్ లో జరిగిన నాలుగో టెస్టు మాత్రం బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టింది. ఎందుకంటే తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. 480 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 571 పరుగులకు ఆలౌటైంది.
ఇలా రెండు జట్లు.. తమ తొలి ఇన్నింగ్స్ లు ఆడటానికే ఏకంగా నాలుగు రోజులు పట్టేసింది. దీంతో ఐదో రోజు ఎలాగైనా సరే రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న ఆసీస్ ని కట్టడి చేయాలని కెప్టెన్ రోహిత్ శర్మ భావించాడు. అందులో భాగంగా రెగ్యులర్ బౌలర్లతో పాటు పుజారా, గిల్ తోనూ తలో ఓవర్ బౌలింగ్ వేయించాడు. ఇది చూసిన చాలామంది క్రికెట్ ప్రేమికులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఎప్పుడు బ్యాటుతో కనిపించే వీళ్లిద్దరూ బౌలింగ్ చేసేసరికి.. ఇదేమి పిచ్ రా బాబు అని మాట్లాడుకుంటున్నారు. ఇక రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 175/2 పరుగులతో ఉన్న సమయంలో మ్యాచ్ ని డ్రాగా ముగించేశారు. ఏదైతేనేం గిల్, పుజారా బౌలింగ్ చేయడం మాత్రం కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. మరి దీనిపై మీరేం అంటారు. కింద కామెంట్ చేయండి.
Pujara and Gill giving serious competition to Ashwin and Jadeja 😼#INDvsAUS pic.twitter.com/CFFdtGVPLO
— Utsav 💔 (@utsav045) March 13, 2023