”అంగట్లో అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని” అన్నట్లు తయ్యారు అయ్యింది ఢిల్లీ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ పృథ్వీ షా పరిస్థితి. అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ టీమిండియా జట్టులో మాత్రం చోటు సంపాదించుకోలేక పోతున్నాడు. ఇక అడపాదడపా అవకాశాలు వస్తున్నప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోవడంలో ఈ డ్యాషింగ్ బ్యాటర్ సఫలం కావడంలేదు. గాయాలు, ఫిట్ నెస్ కొల్పోవడం వంటి పలు కారణాలతో అతడిని సెలక్టర్లు పట్టించుకోవడం లేదు. దాంతో పృథ్వీ షాకు కోపం వచ్చి తాజాగా సెలక్టర్లపై మండిపడ్డ సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో భాగంగా షా దుమ్ము రేపుతున్నాడు. తన కెరీర్ లో తొలి టీ20 సెంచరీని నమోదు చేసి తాజాగా రికార్డు నెలకొల్పాడు.
పృథ్వీ షా.. టీమిండియాకు దొరికిన మరో వీరేంద్ర సెహ్వాగ్ అని.. మెుదట్లో అతడి ఆట చూసిన క్రీడా దిగ్గజాల అభిప్రాయం. వారి అభిప్రాయానికి తగ్గట్లుగానే అతడు ఐపీఎల్ ల్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తరపున మెరుపు ఇన్నింగ్స్ లు ఆడి ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చాడు. ఇక తొలి టెస్ట్ మ్యాచ్ లోనే సెంచరీ చేసిన అతిపిన్న వయస్కుడిగా రికార్డును సైతం నెలకొల్పాడు. అయితే దేశవాలీ క్రికెట్ లో అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ.. టీమిండియాలో మాత్రం చోటు దక్కించుకోలేక పోతున్నాడు. తాజాగా మరో సారి తన బ్యాట్ కు పని చెప్పి.. సెలక్టర్లకు సవాల్ విసిరాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో భాగంగా తాజాగా అస్సాం తో జరుగుతున్న మ్యాచ్ లో తన విశ్వరూపాన్నే చూపాడు. అస్సాం బౌలర్లను ఊచకోత కోస్తూ.. కేవలం 61 బంతుల్లోనే 13 ఫోర్లు, 9 సిక్స్ లతో 134 పరుగులు చేశాడు. దాంతో ముంబాయి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పొయి 230 పరుగుల భారీ స్కోరు చేసింది.
Prithvi Shaw 💫#SyedMushtaqAliTrophy2022 | @PrithviShaw pic.twitter.com/RceAG2ICk3
— CricTracker (@Cricketracker) October 14, 2022
ఈ క్రమంలోనే మ్యాచ్ లో షా స్ట్రైక్ రేట్ 219 ఉండటం గమనార్హం. 19 బంతుల్లో అర్దశతకం సాధించిన షా.. శతకాన్ని 46 బాల్స్ లో సాధించాడు. షా విధ్వంసం ముందు ప్రత్యర్థి బౌలర్లు ప్రేక్షకపాత్ర వహించక తప్పలేదు. ఇక ఈ ఇన్నింగ్స్ చూసైనా భారత సెలక్టర్లు.. పృథ్వీ షాను పరిగణంలోకి తీసుకుంటారా? లేదా? అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరికొంత మంది క్రీడాభిమానులు, క్రీడా నిపుణులు మాత్రం భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా షా అద్బుతంగా రాణిస్తున్న మాట వాస్తవమే అయినప్పటికీ.. అతడు తన ఫిట్ నెస్ ను కాపాడుకోవడంలో విఫలం అవుతున్నాడని గతంలో విమర్శలు సైతం వచ్చాయి. ఆ విమర్శలకు సమాధానంగా అతడు ఓ వైపు బ్యాట్ తో సమాధానం చెప్తూనే, మరోవైపు శారీరకంగా బరువు తగ్గి చూపించాడు. జట్టులో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శుబ్ మన్ గిల్, ధావన్ లాంటి వారు ఓపెనర్లుగా ఇప్పటికే జట్టులో ఉండటం కూడా షాకు ప్రతికూలంగా మారిందని చెప్పవచ్చు.
Prithvi Shaw smashed his maiden T20 century for Mumbai vs Assam in Syed Mushtaq Ali Trophy T20 2022.
📸: Disney+Hotstar pic.twitter.com/fgA9wvj3Oa
— CricTracker (@Cricketracker) October 14, 2022
.@PrithviShaw with a 19-ball fifty in #SyedMushtaqAliT20 💥💥
📸: Disney+Hotstar pic.twitter.com/tHK1lR3rmr
— CricTracker (@Cricketracker) October 14, 2022